మెగా ఫీవర్: సైరా ట్రైలర్ నిడివి ఇంతే..

Published : Sep 18, 2019, 03:08 PM ISTUpdated : Sep 18, 2019, 03:10 PM IST
మెగా ఫీవర్: సైరా ట్రైలర్ నిడివి ఇంతే..

సారాంశం

భారీ అంచనాల మధ్య విడుదల కానున్న సైరా అక్టోబర్ 2న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే సినిమా రిలీజ్ కు సమయం దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ డోస్ పెంచింది.

భారీ అంచనాల మధ్య విడుదల కానున్న సైరా అక్టోబర్ 2న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే సినిమా రిలీజ్ కు సమయం దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ డోస్ పెంచింది. ఇక మెయిన్ గా ట్రైలర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరికొద్ది క్షణాల్లో సినిమా ట్రైలర్ రిలీజ్ కాబోతోంది. 

అయితే ట్రైలర్ లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితంలో ప్రధాన అంశాల్ని అలాగే హెవీ యాక్షన్ క్లిప్స్ ని చూపించబోతున్నారు. మొత్తంగా ట్రైలర్ 2నిమిషాల 54 సెకన్లు.  ఆ కొద్దీ సమయంలోనే ఎన్నో విజువల్స్ ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేయనున్నాయి. 

స్వాతంత్రసమరయోధుడు  ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథతో తెరకెక్కిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, నయనతార, జగపతి బాబు, విజయ్ సేతుపతి, రవి కిషన్, సుదీప్, తమన్నా, నిహారిక, అనుష్క తదితరులు కీలక పాత్రలలో నటించారు. అమిత్ త్రివేది సంగీతం అందించారు.

PREV
click me!

Recommended Stories

RajaSaab కి ఒకవైపు నెగిటివ్ టాక్ వస్తుంటే హీరోయిన్ ఏం చేస్తోందో తెలుసా.. బన్నీని బుట్టలో వేసుకునే ప్రయత్నం ?
Illu Illalu Pillalu Today Episode Jan 13: డబ్బు పోగొట్టిన సాగర్, అమూల్యకు పెళ్లి ఇష్టం లేదన్న వేదవతి