సైరా ప్రీరిలీజ్: జాతి కోసం యుద్ధం చేస్తే అది చరిత్ర.. పరుచూరి!

By tirumala ANFirst Published Sep 22, 2019, 7:45 PM IST
Highlights

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్ర ప్రీరిలీజ్ వేడుక హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో వైభవంగా జరుగుతోంది. ప్రీరిలీజ్ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్, రాజమౌళి, కొరటాల శివ, వివి వినాయక్ లాంటి ప్రముఖులు హాజరవుతున్నారు. 

సైరా ప్రీరిలీజ్ వేడుకలో చిత్రానికి రచయితగా పనిచేసిన పరుచూరి వెంకటేశ్వర రావు ప్రసంగించారు. సైరా నరసింహారెడ్డి చిత్రం తమ 10 ఏళ్ల కల అని అన్నారు. ఆ కలని తన తండ్రి కోసం రాంచరణ్ నెరవేరుస్తున్నాడని అన్నారు. భార్య కోసం యుద్ధం చేస్తే పురాణం అయింది.. భూమి కోసం యుద్ధం చేస్తే ఇతిహాసం అయింది.. జాతి కోసం యుద్ధం చేస్తే చరిత్ర అవుతుంది అని చిరంజీవితో అమితాబ్ బచ్చన్ చెప్పే డైలాగ్ ని రివీల్ చేశారు. 

ఈ చిత్రానికి డైలాగులు అందించిన సాయి మాధవ్ బుర్రా కూడా ప్రీరిలీజ్ వేడుకకు హాజరయ్యారు. మా అమ్మమ్మ చెబుతుండేది.. చిరంజీవికి మాటలు రాయరా అని కోరింది.. నువ్వు ఆకాశాన్ని అందుకోమంటున్నావు అది జరగదు అని అప్పుడు చెప్పా. కానీ ఈ రోజు సైరా చిత్రానికి నేనే డైలాగులు రాసా అని సాయిమాధవ్ అన్నారు. 

నేను చిరంజీవి డైలాగులు రాసిన మొదటి చిత్రం ఖైదీ నెం 150. సాయిమాధవ్ ప్రసంగిస్తుండగానే ఈవెంట్ కు సైరా దర్శకుడు సురేందర్ రెడ్డి,  నిర్మాత సురేష్ బాబు, ఆర్ఆర్ఆర్ నిర్మాత డివివి దానయ్య హాజరయ్యారు. 

సైరా ప్రీరిలీజ్ ఈవెంట్: రామ్ లక్ష్మణ్ వచ్చేశారు.. జనసంద్రంలా ఎల్బీ స్టేడియం!

click me!