రాజమౌళి ఇచ్చిన సలహా ఫాలో అయిన మెగాస్టార్ ?

By tirumala ANFirst Published Sep 23, 2019, 4:46 PM IST
Highlights

సైరా నరసింహారెడ్డి చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఇక విడుదల మాత్రమే మిగిలి ఉంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా చిత్రం పాన్ ఇండియా మూవీగా దక్షణాది అన్నిభాషలతో పాటు హిందీలో కూడా విడుదలవుతోంది. 

ఆదివారం రోజు ప్రీరిలీజ్ ఈవెంట్ పూర్తి చేసుకున్న సైరా చిత్ర యూనిట్ కొద్దిసేపటి క్రితమే సెన్సార్ కార్యక్రమాలు కూడా ముగించారు. సెన్సార్ సభ్యులు సైరా చిత్రానికి యుఏ సర్టిఫికెట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. సైరా చిత్ర ఫైనల్ రన్ టైం 2:44 గంటలుగా నిర్ణయించారు. 

రన్ టైం విషయంలో ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం సైరా చిత్ర యూనిట్ కి దర్శకధీరుడు రాజమౌళి ఎడిటింగ్ విషయంలో సలహాలు ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. ఇదిలా ఉండగా సైరా చిత్రం 2:44 గంటల రన్ టైం ఫిక్స్ చేసుకోవడానికి కారణం రాజమౌళి ఇచ్చిన సలహానే అని అంటున్నారు. 

ఎట్టి పరిస్థితుల్లో సైరా నిడివి 2:45 గంటలు మించకుండా ఉండాలని రాజమౌళి సూచించారట. ఆమేరకు ఎడిటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా సైరా చిత్రంలో కేవలం 2 లేదా 3 పాటలు మాత్రమే ఉండనున్నాయి. సాధారణంగా 5 పాటలు ఉండే చిత్రానికి 164 మినిషాలు అనేది పర్ఫెక్ట్ రన్ టైం. కానీ సైరాలో అన్ని పాటలు ఉండడం లేదు. కాబట్టి కథలో ఏమాత్రం ల్యాగ్ ఉన్నా ప్రమాదమే. 

ఇది ఉయ్యాలవాడ జీవిత చరిత్ర.. పైగా స్క్రీన్ ప్లేపై పట్టున్న సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న చిత్రం కాబట్టి సినిమాపై నమ్మకం ఉంచొచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అన్ని భాషల్లో సైరా సెన్సార్ పూర్తయింది. ఇక అక్టోబర్ 1న ప్రారంభం కాబోయే ప్రీమియర్ షోలపైనే అందరి దృష్టి. 

 

click me!