సైరా: నొస్సం కోట అటాక్ అదుర్స్.. యుద్ధంలో 10వేలమంది ఊచకోత

By tirumala ANFirst Published Oct 2, 2019, 3:55 AM IST
Highlights

సైరా నరసింహారెడ్డి రిలీజ్ ఫీవర్ తో తెలుగు రాష్ట్రాల్లోని సినీ అభిమానులు ఊగిపోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా చిత్రం అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఇది. 

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా చిత్రం థియేటర్స్ లో సందడి చేసే సమయం రానేవచ్చింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో సైరా ప్రీమియర్ షోల ప్రదర్శన పూర్తయింది. యుఎస్ ప్రీమియర్స్ నుంచి సైరా చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తోంది. ఇంటర్వెల్ ముందు, ఇంటర్వెల్ తర్వాత వచ్చే సన్నివేశాలు రోమాలు నిక్కబడుచుకునేలా చేస్తున్నాయి. 

ఇంటర్వెల్ తర్వాత నొస్సం కోట అటాక్ అద్భుతంగా ఉంది. ఈ సన్నివేశంలో సురేందర్ రెడ్డి విజన్, రత్నవేలు సినిమాటోగ్రఫీ, మెగాస్టార్ స్క్రీన్ ప్రజెన్స్ కట్టిపడేస్తాయి. మూన్ లైట్ లో నొస్సం కోట ఎపిసోడ్ ని చక్కగా చిత్రీకరించారు. 

ఇక క్లైమాక్స్ కి ముందు వచ్చే పెద్ద వార్ ఎపిసోడ్ కూడా విజువల్ పరంగా ఆకట్టుకుంది. ఈ సన్నివేశంలో 10 వేలమంది బ్రిటిష్ ఆర్మీ, 3 వేలమంది నరసింహాసరెడ్డి సైనికులు మరణిస్తారు. దర్శకుడు సురేందర్ రెడ్డి సినిమా మొత్తం ఎమోషన్ మిస్ కాకుండా చూసుకున్నారు. 

click me!