సైరా నరసింహారెడ్డి షూటింగ్ నేడే ప్రారంభం

Published : Dec 06, 2017, 12:56 AM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
సైరా నరసింహారెడ్డి షూటింగ్ నేడే ప్రారంభం

సారాంశం

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డి కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించనున్న రామ్ చరణ్ స్టైలిష్ డైరెక్టర్ సురెందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న సైరా

చిరంజీవి హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న చిరు 151వ సినిమా సైరా నరసింహారెడ్డి నేడే పట్టాలపైకి రానుంది. హైదరాబాద్ లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇవాళ స్టార్ట్ అవుతుంది. ఈ మేరకు అల్యూమినియం ఫ్యాక్టరీలో సెట్ రెడీ అయింది. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాను కొణిదెల  రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. నయనతార ఇందులో హీరోయిన్ గా ఎంపికైంది. చిరంజీవి కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా సైరా నరసింహా రెడ్డి తెరకెక్కనుంది.

 

నిజానికి సైరా షూటింగ్ స్టార్ట్ అవ్వాలి. కానీ కెమెరామెన్ రవివర్మన్ తప్పుకోవడంతో షూట్ వాయిదాపడింది. ఆ తర్వాత ఏఆర్ రెహ్మాన్ కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో మరింత ఆలస్యమైంది. ఎట్టకేలకు రత్నవేలు సినిమాటోగ్రఫీతో సైరా షూటింగ్ రేపట్నుంచి మొదలుకానుంది. త్వరలోనే మ్యూజిక్ డైరక్టర్ ఎంపిక కూడా పూర్తవుతుంది.

 

సైరాకు సంబంధించి టెస్ట్ షూట్ కూడా జరిగింది. నవంబర్ లో చిరంజీవిపై ట్రయల్ షూట్ నిర్వహించారు. చిరంజీవి గెటప్ సరిగ్గా కుదిరిందా లేదా అనే అనుమానంతో ఈ షూట్ చేశారు. ఆ ఔట్ పుట్ పై యూనిట్ సభ్యులతో పాటు పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు సంతృప్తి వ్యక్తంచేయడంతో రెగ్యులర్ షూటింగ్ కు లైన్ క్లియర్ అయింది.

PREV
click me!

Recommended Stories

Illu Illalu Pillalu Today Episode Dec 25: రామరాజు కుటుంబంలో పెద్ద కుంపటి, అమూల్య లవ్ మ్యాటర్ రివీల్
Karthika Deepam 2 Today Episode: శ్రీధర్ మనసు ముక్కలు చేసిన కాంచన- అమ్మానాన్నలను కార్తీక్ కలుపుతాడా?