సైరా లీకులపై రామ్ చరణ్ గుస్సా!

Published : Sep 14, 2017, 02:47 PM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
సైరా లీకులపై రామ్ చరణ్ గుస్సా!

సారాంశం

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రంగా సైరా నరసింహారెడ్డి భారీ బడ్జెట్ తో కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్న రామ్ చరణ్ సైరా కు సంబంంధించిన లీకులతో రామ్ చరణ్ అసహనం

మెగాస్టార్ చిరంజీవి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. రాయలసీమకు చెందిన స్వాతంత్ర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రం బాహుబలి రేంజ్ లో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. ఖైదీ నెంబర్ 150 సినిమా ఇచ్చిన సక్సెస్ తో రఫ్పాడించేస్తున్న చిరంజీవి.. ఉయ్యాలవాడతో సన సత్తా మరోసారి నిరూపించేందుకు రెడీ అయ్యారు. మరొక వైపు ప్రొడ్యూసర్ గా రామ్ చరణ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అత్యంత భారీ బడ్జెట్ తో ‘ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి’ ని తీస్తున్న విషయం తెలిసిందే. 

 

అయితే ఈసినిమాకు సంబంధించిన షూటింగ్ ఇంకా ప్రారంభం కాకపోయినా ఈసినిమా విషయంలో వస్తున్న గాసిప్పులు లీకుల విషయంలో చరణ్ తీవ్ర అసహనంలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈసినిమాకు సంబంధించిన నటీనటుల క్యారెక్టర్ డిటైల్స్ తో పాటు నెమ్మదిగా ఈసినిమా కథకు సంబంధించిన లీకులు బయటకు రావడం చరణ్ కు ఏమాత్రం రుచించడంలేదు అని టాక్. 

 

కేవలం రాయలసీమ వాసులకే పరిచయం ఉన్న ‘ఉయ్యాలవాడ’ కథ పూర్తిగా ఓపెన్ అవ్వడం చరణ్ కు నచ్చడం లేదు అని అంటున్నారు. ఈసినిమా స్క్రిప్ట్ గురించి పరుచూరి బ్రదర్స్ తో పాటు చాలామంది రచయితలు సహకరిస్తున్న నేపధ్యంలో రైటర్స్ సర్కిల్ నుండి ఈసినిమాకు సంబంధించిన లీకులు వస్తున్నాయని చరణ్ గుర్తించినట్లు టాక్.

 

ఇది ఇలా ఉండగా ఈసినిమా ఫైనల్ స్క్రిప్ట్ ఇంకా పూర్తికాలేదు అన్న వార్తలు వస్తున్నాయి. 18వ శతాబ్దానికి చెందిన వ్యక్తి కథ కావడంతో పాటు ‘ఉయ్యాలవాడ’ చరిత్రకు సంబంధించిన చారిత్రక ఆధారాలు లభించడంలో కొంత ఆలస్యం అవుతున్న నేపధ్యంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం నవంబర్ ప్రాంతానికి వెళ్ళిపోయినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు.. 

 

అయితే టాప్ హీరోల సినిమాలకు సంబంధించిన సినిమాల పై లీకులు రావడం సర్వసాధారణంగా మారిన నేపధ్యంలో చరణ్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ‘ఉయ్యాలవాడ’ పై వస్తున్న లీకులు ఆపగలడా అంటూ కొందరు గుసగుసలాడుకుంటున్నారు.

PREV
click me!

Recommended Stories

5000 తో ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చింది, ప్రస్తుతం 5 నిమిషాలకు 3 కోట్లు వసూలు చేస్తున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
Actor Sivaji: మహిళా కమిషన్‌ దెబ్బకి దిగొచ్చిన శివాజీ.. స్త్రీ అంటే మహాశక్తితో సమానం అంటూ క్షమాపణలు