'సై రా' షూటింగ్ ని అడ్డుకున్న ముస్లిం యువకులు!

Published : Feb 25, 2019, 01:52 PM IST
'సై రా' షూటింగ్ ని అడ్డుకున్న ముస్లిం యువకులు!

సారాంశం

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో దర్శకుడు సురేందర్ రెడ్డి రూపొందిస్తోన్న చిత్రం 'సై రా నరసింహారెడ్డి'. ఈ సినిమా చిత్రీకరణలో భాగంగా బీదర్ లో ఓ షెడ్యూల్ ప్లాన్ చేసింది చిత్రబృందం. 

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో దర్శకుడు సురేందర్ రెడ్డి రూపొందిస్తోన్న చిత్రం 'సై రా నరసింహారెడ్డి'. ఈ సినిమా చిత్రీకరణలో భాగంగా బీదర్ లో ఓ షెడ్యూల్ ప్లాన్ చేసింది చిత్రబృందం. అయితే అక్కడ కొందరు ముస్లిం యువకులు ఈ సినిమా చిత్రీకరణను అడ్డుకున్నారు.

దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వివరాల్లోకి వెళితే.. సినిమా షూటింగ్ బహుమనీ సుల్తాన్ కోటలో జరుగుతోంది. అది ముస్లిం ప్రార్ధనా స్థానాల్ కావడంతో అక్కడ హిందువులకు చెందిన విగ్రహాలు ఉంచకూడదని ముస్లిం యువకులు గుంపుగా వచ్చి అడ్డుకున్నట్లు తెలిసింది.

షూటింగ్ ప్రాంతంలో హిందువులకు చెందిన విగ్రహాలను తొలగించాలని ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా.. బీదర్ జిల్లా అధికారి నివాసం ముందు ముస్లింలు ఆందోళన చేపట్టారు. సినిమా డైరెక్టర్ ని, కన్నడ నటుడు కిచ్చా సుదీప్ పై కేసు పెట్టాలని వారు పట్టిబట్టారు.

రంగంలోకి దిగిన పోలీసులు హిందూ విగ్రహాలను, షూటింగ్ కోసం వేసిన సెట్ ని తొలగించినట్లు తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: ఎలాగైనా రీతూని సైడ్ చేయాలని కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్ కుట్ర.. వీళ్ళ స్ట్రాటజీతో భరణి బలి
Akhanda 2 Premiers: అఖండ 2 ప్రీమియర్ షోలు రద్దు, తీవ్ర ఇబ్బందుల్లో నిర్మాతలు.. సినిమా రిలీజ్ పరిస్థితి ఏంటి ?