చెర్రీ కోపానికి స్పీడెక్కిన సైరా!

By Prashanth MFirst Published Apr 16, 2019, 3:53 PM IST
Highlights

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమా రిలీజ్ డేట్ లో ఇంకా క్లారిటీ రావడం లేదు. సమ్మర్ మిడ్ లో సినిమాను తప్పకుండా రిలీజ్ చేస్తామని నిర్మాత రామ్ చరణ్ మాటిచ్చేశాడు. అయితే సినిమా షూటింగ్ పనులు మాత్రం ఇంకా ఓ కొలిక్కి రాలేదు.

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమా రిలీజ్ డేట్ లో ఇంకా క్లారిటీ రావడం లేదు. సమ్మర్ మిడ్ లో సినిమాను తప్పకుండా రిలీజ్ చేస్తామని నిర్మాత రామ్ చరణ్ మాటిచ్చేశాడు. అయితే సినిమా షూటింగ్ పనులు మాత్రం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. చరణ్ రీసెంట్ గా చిత్ర యూనిట్ కి క్లాస్ పీకినట్లు టాక్ కూడా వచ్చింది. 

దీంతో ఇప్పుడు పనులు ఉపందుకున్నాయని తెలుస్తోంది. ఫైనల్ గా మరో చిన్నపాటి యాక్షన్ సీన్ కోసం సైరా గ్యాంగ్ కేరళకు వెళ్లనుంది. దాదాపు వారానికి పైగా అక్కడే మెగాస్టార్ తో కొన్ని యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేసి మళ్ళీ భాగ్యనగరానికి షిఫ్ట్ కానున్నారు. మిగతా ఎండింగ్ పార్ట్ ను మొత్తం ఇక్కడ ఫినిష్ చేసి ఫైనల్ గా పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా స్టార్ట్ చెయ్యాలని చిత్ర యూనిట్ టార్గెట్ గా పెట్టుకుంది. 

ఇక అప్పుడే సినిమా రెగ్యులర్ ప్రమోషన్స్ ని కూడా స్టార్ట్ చేయాలని దర్శకుడు సురేందర్ రెడ్డి ఆలోచిస్తున్నాడు. నయనతర హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో అమితాబ్ - సుదీప్ - విజయ్ సేతుపతి ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఇక బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు.   

click me!