అతగాడితో హీరోయిన్ ఘాటు రొమాన్స్.. వైరల్ అవుతోన్న ఫోటోలు!

By Udaya DFirst Published 16, Apr 2019, 3:41 PM IST
Highlights

'సవ్యసాచి' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ముంబై భామ నిధి అగర్వాల్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ రూపొందిస్తోన్న 'ఇస్మార్ట్ శంకర్' సినిమాలో నటిస్తోంది. 

'సవ్యసాచి' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ముంబై భామ నిధి అగర్వాల్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ రూపొందిస్తోన్న 'ఇస్మార్ట్ శంకర్' సినిమాలో నటిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ మేకప్ ఆర్టిస్ట్ తో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇండస్ట్రీలో చాలా మంది నటీనటులకు మేకప్, హెయిర్ డిజైనర్ గా పని చేస్తుంటాడు షాన్. ఇంటర్నేషనల్ వైడ్ అతడికి మంచి గుర్తింపు ఉంది. కోట్లలో సంపాదించే షాన్ కి ఇండస్ట్రీలో పరిచయాలు చాలా ఎక్కువ. నిధి కూడా అతగాడికి మంచి స్నేహితురాలట. ఆమె ఎంత క్లోజో చెప్పడానికి తాజాగా కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఇందులో నిధి.. షాన్ బుగ్గపై ఘాటుగా ముద్దు పెడుతూ కనిపించింది.

ఓ ఫోటోలో షాన్ కూడా నిధిని ముద్దుపెట్టుకున్నాడు. ఈ ఫోటోలు పోస్ట్ చేసిన నిధి.. ''జీఎస్ టీ రీయూనియన్'' అంటూ క్యాప్షన్ పెట్టింది. ఇది చూసిన షాన్.. ''బబ్బూ.. మళ్లీ మనం చేశాం.. ఒక పగలు,ఒక రాత్రి ఎప్పటికీ గుర్తుండేలా.. నిన్ను ఎప్పటికీ పిచ్చిగా ప్రేమిస్తూనే ఉంటా.. నువ్ నాకెంతో ప్రత్యేకమైన అమ్మాయివి'' అంటూ రిప్లయ్ పెట్టాడు.

షాన్ తనకు కేవలం మంచి స్నేహితుడని మాత్రమే చెబుతుంటుంది నిధి. ఇతగాడికి నిధి మాత్రమే కాదు.. చాలా మంది గాళ్ ఫ్రెండ్స్ ఉన్నారు. వారిలో జాక్విలిన్ ఫెర్నాండెజ్, సేర్నీ, సోఫీ చౌదరి ఇలా చాలా మంది సెలబ్రిటీలు ఉన్నారు. 
 

Last Updated 16, Apr 2019, 3:41 PM IST