ఎన్టీఆర్‌పై మనసు పారేసుకున్న `స్వాతిముత్యం` హీరోయిన్‌.. సైకోలాగా చేయాలనుందంటూ కామెంట్

Published : Oct 03, 2022, 07:40 PM IST
ఎన్టీఆర్‌పై మనసు పారేసుకున్న `స్వాతిముత్యం` హీరోయిన్‌.. సైకోలాగా చేయాలనుందంటూ కామెంట్

సారాంశం

యంగ్‌ హీరోయిన్‌ వర్ష బొలమ్మ డిఫరెంట్‌ కాన్సెప్ట్ చిత్రాల్లో నటిస్తూ మెప్పిస్తుంది.  తాజాగా ఈ బ్యూటీ ఎన్టీఆర్‌పై మనసు పారేసుకుంది.  పలు హాట్‌ కామెంట్లు చేసింది. 

`స్వాతిముత్యం` హీరోయిన్ వర్ష బొల్లమ్మ.. ఎన్టీఆర్‌పై ప్రశంసలు కురిపించింది. ఆయన నటనంటే చాలా ఇష్టమని తెలిసింది. ఆయనకు పెద్ద అభిమానిని అని వెల్లడించింది. అంతేకాదు `ఆర్‌ఆర్‌ఆర్‌`లో `కొమురం భీముడో` సాంగ్‌లో ఆయన నటనకు ఫిదా అయినట్టు చెప్పింది. తాజాగా వర్ష బొల్లమ్మ.. `స్వాతిముత్యం` చిత్రంలో నటిస్తుంది. బెల్లంకొండ గణేష్‌ హీరోగా పరిచయం అవుతున్న చిత్రమిది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్‌ 5న విడుదల కానుంది.

ఈ సందర్భంగా వర్ష బొల్లమ్మ మాట్లాడుతూ, ఇందులో తాన టీచర్‌గా నటించానని తెలిపింది. రియల్‌ లైఫ్‌లోని చాలా మంది గురువులను చూసి ఇన్‌స్పైర్‌ అయి నటించినట్టు చెప్పింది. గణేష్‌ని డామినేట్‌ చేసేలా తన పాత్ర ఉంటుందని, అదే సమయంలో తన రియల్‌ లైఫ్‌కి దగ్గరగా ఉంటుందని చెప్పింది. తాను కూడా చిన్న టౌన్‌ నుంచి వచ్చిన అమ్మాయిని అని పేర్కొంది. 

సినిమా ప్రధానంగా స్పెర్మ్ డొనేషన్‌ నేపథ్యంలో సాగుతున్న నేపథ్యంలో `విక్కీ డోనర్‌`ని పోలి ఉంటుందా అనే ప్రశ్నకి వర్ష చెబుతూ, కథాంశం మాత్రమే పోలిక అని, మిగిలినవన్నీ డిఫరెంట్‌గా ఉంటాయని చెప్పింది. స్క్రీన్‌ప్లే భిన్నంగా  ఉంటుందని, ప్రేమతోపాటు మంచి వినోదంతో కూడిన అంశాలున్నాయని పేర్కొంది. ఎక్కువగా  యంగ్‌ హీరోలతో సినిమాలు చేస్తున్నారనే ప్రశ్నకి స్పందిస్తూ, అనుకోకుండా అలా జరుగుతున్నాయని, దానికి ప్రత్యేకంగా ప్లాన్‌ అంటూ ఏం లేదని చెప్పింది. అయితే యంగ్‌ హీరోలే డిఫరెంట్‌ కాన్సెప్ట్ తో కూడిన కథలతో వస్తున్నారని  చెప్పింది. 

తన డ్రీమ్‌ రోల్స్ గురించి చెబుతూ, వర్ష ఇలాంటి పాత్రలు కూడా చేస్తుందా? అనేట్టు ఉండే పాత్రలు చేయాలని ఉందని, నెగటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలంటే ఇష్టమట. ముఖ్యంగా సైకోలాంటి పాత్రలు చేయాలనుందని చెప్పింది వర్ష. తనకు స్టార్‌ హీరోయిన్‌ ఇమేజ్‌ తెచ్చుకోవాలనే ఆశలేదని, నటనకు ప్రయారిటీ ఉన్న పాత్రలే చేయాలని ఉందని చెప్పింది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode: మీకు నాకంటే దీపే ఎక్కువన్న జ్యో-పారు మాటలను తండ్రితో చెప్పిన శౌర్య
Akhanda 2 Release పై మరో బ్యాడ్‌ న్యూస్‌ చెప్పిన నిర్మాతలు.. కొత్త రిలీజ్‌ డేట్‌ ఎప్పుడంటే?