మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. చిత్రం నుంచి తాజాగా ఫస్ట్ సింగిల్ గా ఫుల్ లిరికల్ వీడియోను విడుదల చేశారు. లిరిక్స్,, ట్యూన్, వీడియో ఆకట్టుకుంటోంది.
టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ జోష్ మీద ఉన్నారు. రీసెంట్ గానే ‘దాస్ కా ధమ్కీ’ చిత్రంతో హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మాస్ అవతార్ లో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs Of Godavari) తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కృష్ణ చైతన్య ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. డీజేటిల్లు ఫేమ్ హీరోయిన్ నేహా శెట్టి (Neha Shetty) కథానాయిక. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటోంది.
ఇక మూవీ యూనిట్ వరసగా అప్డేట్స్ అందిస్తూ సినిమాపై హైప్ పెంచేస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ కు మాస్ రెస్పాన్స్ దక్కింది. ఇక తాజాగా ఫస్ట్ సింగిల్ ను కూడా విడుదల చేశారు. రొమాంటిక్ మెలోడీగా వచ్చిన Suttamla Soosi అనే సాంగ్ యూత్ ను ఆకట్టుకునేలా ఉంది. ఈ లిరికల్ వీడియోకు యూట్యూబ్ లో మంచి ఆదరణ దక్కుతోంది.
చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఫస్ట్ సింగిల్ కు బ్యూటీఫుల్ మ్యూజిక్ ను అందించారు. మొదటి పాటకు శ్రీ హర్ష ఏమని సాహిత్యం అందించారు. మనస్సును హత్తుకునేలా యువతను ఆకట్టుకునేలా లిరిక్స్ రాశారు. ప్రముఖ సింగర్ అనురాగ్ కులకర్ణి తన అద్భుతమైన గాత్రంతో సాంగ్ ను నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్లారు. ఇక యువన్ శంకర్ రాజా సంగీతం అదిరిపోయింది. ఫస్ట్ వినగానే మ్యూజిక్ లవర్ ప్లేలిస్ట్ లో చేరిపోయేలా క్యాచీ ట్యూన్ అందించారు.
సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పీరియాడిక్ పొలిటికల్ టచ్ తో తెరకెక్కుతోంది. 1980… ఆ ప్రాంతంలో గోదావరి నేపథ్యంలో జరిగే కథ ఇది అని తెలుస్తోంది. హీరోయిన్ అంజలి కీలక పాత్ర పోషిస్తోంది. అలాగే కమెడియన్ హైపర్ ఆది కూడా మరోపాత్రలో అలరించనున్నారు.
Indulge in a romantic escapade with our enchanting melody song from 💞🌊
A magical melody 🎶 🎹
Lyrical Video Out Now ▶️ https://t.co/vOjwO0I6ze
🎤
✍️ …