సుశాంత్ సింగ్ స్నేహితురాలు ఆత్మహత్య.. ఇప్పుడూ అదే ప్రయత్నం జరుగుతుందట?

Published : Oct 18, 2022, 01:26 PM IST
సుశాంత్ సింగ్ స్నేహితురాలు ఆత్మహత్య.. ఇప్పుడూ అదే ప్రయత్నం జరుగుతుందట?

సారాంశం

దివంగత, బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తర్వాత వరుసగా అతని స్నేహితులూ సూసైడ్ చేసుకుంటున్నారు. ఇప్పటికే ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. తాజాగా మరో స్నేహితురాలు కూడా ఆత్మహత్య చేసుకుంది.   

బాలీవుడ్ స్టార్ హీరో, దివంగత సుశాంత్ సింగ్ రాజ్ పుత్ (Sushanth Singh Rajput) రెండేండ్ల కింద ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన సూసైడ్ అప్పట్లో బాలీవుడ్ లో  సంచలనం సృష్టించింది. సుశాంత్ సింగ్ మరణం వెనుక దాగున్నది ఎవరనేది కనుగొనేందుకు కేసును చాలా రోజులు దర్యాప్తు చేశారు. అయితే కేసు దర్యాప్తు కొనసాగుతుండగానే.. వరుసగా సుశాంత్ సింగ్ స్నేహితులు ఆత్మహత్యలు చేసుకుంటుండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే ఇద్దరు ఫ్రెండ్స్ సూసైడ్ చేసుకోగా.. తాజాగా మరో స్నేహితురాలు కూడా ఆత్మహత్యకు పాల్పడింది.

బాలీవుడ్ నటి, సుశాంత్ సింగ్ స్నేహితులు వైశాలి ఠక్కర్ (Vaishali Takkar) రెండు రోజులు కింద సూసైడ్ చేసుకుంది. ఈమె మరణం కూడా ప్రస్తుతం బాలీవుడ్ లో సంచలనంగా మారింది. 29 ఏండ్లకే  ఆమె ఆత్మహత్య అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. రెండ్రోజుల కింద తమ నివాసంలోనే వైశాలి ఉరేసుకొని చనిపోయింది. మృతదేహాన్ని గుర్తించిన ఆమె తండ్రి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

అయితే వైశాలిది ఆత్మహత్య కాదని, హత్యగా భావించాలని సన్నిహితులు పోలీసులను కోరుతున్నారు. కానీ పోలీసులు మాత్రం ఘటనా స్థలిలో సూసైడ్ నోట్ లభించిందని, అందులో ఆమె ప్రియుడు రాహుల్ పేరును రాసిందని తెలుపుతున్నారు. అతడి వేధింపులతోనే మనస్థాపానికి గురైన వైశాలి ఆత్మహత్యకు పాల్పడిందని ప్రాథమిక విచారణలో తెలిపారు.  SSR సూసైడ్ కు ముందే ఆత్మహత్య సుశాంత్ బెస్ట్ ఫ్రెండ్ విషయంలోనూ పోలీసులు ఇలాగే స్పందించారు. ఇక 2021  ఫిబ్రవరి 15న మరో స్నేహితుడు సందీప్ నహార్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.. తాజాగా వైశాలి ఠక్కర సౌసైడ్ కు పాల్పడింది. 

వీటన్నింటిని పోలీసులు ఆత్మహత్యలుగానే భావిస్తూ కేను సమోదు చేసి క్లోజ్ చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికీ సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో న్యాయం చేయలేదని, అతని స్నేహితుల విషయంలోనూ అదే జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజగా వైశాలి సూసైడ్ తో మళ్లీ సుశాంత్ ఆత్మహత్య కేసుపై బాలీవుడ్ లో చర్చ మొదలైంది. ఈ సందర్భంగా వైశాలి, సుశాంత్ కలిసి ఉన్న ఫొటోను నెట్టింట వైరల్ చేస్తూ నివాళి అర్పిస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Actor Sreenivasan: ప్రముఖ నటుడు, దర్శకుడు శ్రీనివాసన్ కన్నుమూత.. 48 ఏళ్ల సినీ ప్రస్థానానికి ముగింపు
Bigg Boss Telugu 9: చివరి రోజు ఓటింగ్‌ తలక్రిందులు, పక్కా ప్లాన్‌ ప్రకారమే.. టాప్‌లో ఉన్నదెవరంటే?