
ప్రముఖ మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన సినిమా మాన్ స్టర్. ఈసినిమా ఈనెల 21 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అవ్వాల్సి ఉంది. ఈ సినిమాలో మోహన్ లాల్, లక్కీ సింగ్ పాత్రలో కనిపించనున్నారు. ఉదయ్ కృష్ణ కథను అందించగా, వ్యాసక్ దర్శకత్వం వహించారు. అంతేకాదు ఈ సినిమాలో టాలీవుడ్ నటి లక్ష్మీ మంచు కూడా ఓ ఇంపార్టెంట్ రోల్ లో నటించారు. అయితే ఈ సినిమాకు ఆదిలోనే ఎదురు దెబ్బ తప్పలేదు.
సినిమాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. సినిమా ఏ ఆటకం లేకుండా రిలీజ్ అవుతుంది అని అంతా హ్యాపీ ఫీల్ అయ్యే లోపు... గల్ఫ్ దేశాలు మాన్ స్టర్ మూవీపై నిషేధం విధించాయి. ఈ సినిమాలో ఎల్ జీబీ టీ క్యూ కంటేంట్ ఉందని.. అందుకే ఈమూవీ తమ దగ్గర నడవదని తేల్చి చెప్పేశారు. ఎల్ జీబీ టీ క్యూ కంటేంట్ అంటే.. లెస్బేనియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్ జెండర్ కంటెంట్ ఉండడంతో మూవీ పై నిషేధం విధించినట్లు సమాచారం.
ఈ మూవీ నిర్మాత ఆంటోనీ పెరుంబవూర్ సెన్సార్ బోర్డ్ ఫర్ ఈ ఎవాల్యుయేషన్ కు సినిమా కాపీని అందించినట్టు తెలిసింది. ఒకవేళ బోర్డ్ నుంచి అనుమతి వస్తే వచ్చే వారం గల్ఫ్ దేశాల్లో ఈ సినిమా విడుదల అవుతుందని ఆశ. విశ్వసనీయ వర్గాలు తెలిపాయి సమాచారం ప్రకారం ఈ మూవీ పై గల్ఫ్ దేశాలు కన్విన్స్ అవ్వడం కష్టమనే చెప్పాలి. మరి వారి కోసం ఈమూవీ కంటెంట్ లో మార్పులు చేర్పులు చేస్తారాజ..? లేక అక్కడ సినిమా రిలీజ్ నే ఆపేస్తారా అనేది చూడాలి.