వంద సార్లు చెక్‌ చేశా.. సుశాంత్ చివరి సినిమా హీరోయిన్

Published : Jun 16, 2020, 10:48 AM IST
వంద సార్లు చెక్‌ చేశా.. సుశాంత్ చివరి సినిమా హీరోయిన్

సారాంశం

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ చివరగా దిల్ బెచారా సినిమాలో నటించాడు. ఈ సినిమాతో సుశాంత్‌కు జోడిగా సంజన నటించింది. ముఖేష్ చబ్రా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ పాటికే రిలీజ్‌ కావాల్సి ఉన్నా లాక్‌ డౌన్‌ కారణంగా వాయిదా పడింది. ఈ లోగా సుశాంత్ మరణించటంతో అతడితో కలిసి వర్క్‌ చేసిన అనుభవాలను గుర్తు చేసుకుంది సంజన.

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ మరణించి రెండు  రోజులవుతున్న బాలీవుడ్ సినీ పరిశ్రమ ఆ విషాదం నుంచి కోలుకోలేకపోతోంది. సుశాంత్ మరణవార్త విని షాక్ ఆయిన సన్నిహితులు ఇప్పుడిప్పుడే కాస్త తేరుకొని స్పందిస్తున్నారు. తాజాగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ చివరి సినిమాలో హీరోయిన్‌గా నటించిన సంజనా సంఘీ వీడియో మెసేజ్‌ను రిలీజ్ చేసింది.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ చివరగా దిల్ బెచారా సినిమాలో నటించాడు. ఈ సినిమాతో సుశాంత్‌కు జోడిగా సంజన నటించింది. ముఖేష్ చబ్రా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ పాటికే రిలీజ్‌ కావాల్సి ఉన్నా లాక్‌ డౌన్‌ కారణంగా వాయిదా పడింది. ఈ లోగా సుశాంత్ మరణించటంతో అతడితో కలిసి వర్క్‌ చేసిన అనుభవాలను గుర్తు చేసుకుంది సంజన.

`ఈ వార్త చూసిన వెంటనే వెబ్ పేజ్‌లను 100 సార్లు చెక్‌ చేశాను. ఎవరైన ఫేక్‌ న్యూస్‌ను సర్క్యూలేట్‌ చేస్తున్నారేమో అని భావించాను. నేను నా ఫీలింగ్స్‌ను ఎలా ఎక్స్‌ ప్రెస్‌ చేయలేకపోతున్నా. మేము షూటింగ్ సందర్భంగా జరిగిన సంఘటనలను సినిమా రిలీజ్‌ వరకు దాచి పెట్టాలనుకున్నాం. కానీ ఇలా జరిగింది. ఇది నా ఫస్ట్ సినిమానే కాదు బెస్ట్ సినిమా` సుశాంత్ తో కలిసి షూటింగ్  చేసిన రోజులను గుర్తు చేసుకుంది సంజన.

షూటింగ్ సమయంలో సుశాంత్ తనకు ఎలా హెల్ప్ చేసేవాడో, ఎలా గైడ్  చేసేవాడో గుర్తు చేసుకొని భావోద్వేగానికి లోనైంది. నువ్వు ఎప్పటికీ మాతోనే ఉంటావని నమ్ముతున్నా.. అంటూ తన సందేశాన్ని ముగించింది.

PREV
click me!

Recommended Stories

Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్