అఖిల్ ‘ఏజెంట్’ నుంచి అప్డేట్సే లేవేంటీ.. ఇంతకీ రిలీజ్ ఎప్పుడు.. ఈ బజ్ నిజమేనా?

By team teluguFirst Published Dec 26, 2022, 4:47 PM IST
Highlights

యంగ్ హీరో అక్కినేని అఖిల్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘ఏజెంట్’. సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం ఆలస్యం అవుతోంది. తాజాగా విడుదలపై బజ్ క్రియేట్ అయ్యింది.

యంగ్ హీరో అక్కినేని అఖిల్ (Akkineni Akhil) కేరీర్ ప్రారంభం నుంచి సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. గతేడాది విడుదలైన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’తో డీసెంట్ హిట్ ను సొంతం చేసుకున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన ఈ చిత్రంతో అఖిల్ కేరీర్ స్పీడ్ అందుకుంది. ఇదే జోష్ లో నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై మరింతగా ఫోకస్ పెట్టారు. మాస్ హిట్ ను సొంతం చేసుకునేందుకు తదుపరి చిత్రాన్ని మాస్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి (Surender Reddy)తో అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. 

రెండేండ్ల కిందనే అనౌన్స్ చేసిన ఈ చిత్రం గతేడాది జూలైలో ప్రారంభమైంది. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం అంతకంతూ ఆలస్యం అవుతూ వస్తోంది. మొదట ఈ చిత్రం 24 డిసెంబర్ 2021న విడుదల కావాల్సి ఉంది. అయితే ప్రొడక్షన్ ఆలస్యం కావడం, అఖిల్ కు గాయాల కారణంగా 2022 ఆగస్టు 12న విడుదల చేయబోతున్నట్టు అనౌన్స్ చేశారు. అదీ కుదరకపోవడంతో..  24 అక్టోబర్ 2022ను విడుదల తేదీగా చిత్ర నిర్మాతలు ప్రకటించారు. దాన్ని దాటవేస్తూ వచ్చారు. దీంతో కనీసం వచ్చే ఏడాది సంక్రాంతికైనా విడుదలవుతుందని ఆశించారు. 

ఇంతకీ ‘ఏజెంట్’ విడుదలపై చిత్ర యూనిట్ నుంచి కూడా స్పష్టమైన అప్డేట్స్ రావడం లేదు. దీంతో అభిమానులు అప్సెట్ అవుతున్నారు. అయితే ఈ చిత్రాన్ని సంక్రాంతి బరిలోనూ కాకుండా..  2023 ఫిబ్రవరిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. జనవరి మొదటి వారంలో చిత్రం రిలీజ్ పై పక్కా అనౌన్స్ మెంట్ రానుందని ప్రచారం జరుగుతోంది. మరోమారు 2023 వేసవిలోనే విడుదల చేయబోతున్నారని అంటున్నారు. 

అఖిల్ - సాక్షి వైద్య హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అఖిల్ సాలిడ్ కటౌట్ తో యాక్షన్ సీక్వెల్స్ ను దుమ్ములేపినట్టు తెలుస్తోంది. మలయాళ స్టార్ యాక్టర్ మమ్ముట్టీ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఏకే ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై తెరకెక్కబోతోంది. తెలుగులో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం హిందీ, తమిళం, మలయాళం మరియు కన్నడలోనూ డబ్డ్ వెర్షన్‌ లో విడుదల కానుంది.

click me!