త్వరలో 'ఎంఎస్ ధోని' హీరో పెళ్లి.. వధువు ఎవరో తెలుసా!

Published : Aug 23, 2019, 09:45 PM IST
త్వరలో 'ఎంఎస్ ధోని' హీరో పెళ్లి.. వధువు ఎవరో తెలుసా!

సారాంశం

'ఎంఎస్ ధోని' చిత్రంతో పాపులర్ అయ్యాడు బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్. ఈ క్రేజీ హీరో వరుసగా సినిమాలు చేస్తూ యువతలో మంచి ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నారు. తరచుగా ప్రేమ వ్యవహారాలతో వార్తల్లో నిలిచే సుశాంత్ గురించి ఆసక్తికర వార్త బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.   

ఈ 33 ఏళ్ల హీరో త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.గతంలో పలువురు హీరోయిన్లతో సుశాంత్ ప్రేమ బెడిసికొట్టింది. గతంలో సుశాంత్ టివి నటి అంకితా లోఖండేని ప్రేమించాడు. కొంత కాలం తర్వాత వీరిద్దరూ విడిపోయారు. గత ఏడాది వరకు సుశాంత్, 1 నేనొక్కడినే ఫేమ్ కృతి సనన్ తో చెట్టాపట్టాలేసుకుని తిరిగాడు. వీరిద్దరి ప్రేమ వ్యవహారం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. 

ఆ తర్వాత కృతి సనన్ కు కూడా సుశాంత్ దూరమయ్యాడు. ప్రస్తుతం సుశాంత్ హాట్ బ్యూటీ రియా చక్రవర్తిని గాఢంగా ప్రేమిస్తున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారట. సుశాంత్, రియా తమ ప్రేమని నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లాలని భావిస్తున్నారట. సుశాంత్ సన్నిహితుడు బాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ అతడి పెళ్లి గురించి ప్రస్తావించాడు. 

సుశాంత్, రియా ఇద్దరూ ప్రేమలో ఉన్నారు. త్వరలో వీరిద్దరి వివాహం జరగబోతోంది. ప్రస్తుతం సుశాంత్ కుటుంబ సభ్యులు పెళ్లి గురించి చర్చిస్తున్నారు అని అతడు బాలీవుడ్ మీడియాకు రివీల్ చేశాడు.  

PREV
click me!

Recommended Stories

Akhanda 2 Review: 'అఖండ 2' మూవీ రివ్యూ, రేటింగ్.. బాలకృష్ణ తాండవం ఎలా ఉందో తెలుసా ?
సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే