సుశాంత్‌ కేసులో వాస్తవాలను తెలుసుకోవడం అందరి హక్కు.. శ్వేతా సింగ్‌

By Aithagoni RajuFirst Published Aug 13, 2020, 2:33 PM IST
Highlights

సుశాంత్‌ కేసుకు సంబంధించి తాజాగా ఆయన సోదరి శ్వేతా సింగ్‌ స్పందించారు. ఆమె తన సోదరుడి మృతి కేసుని నిష్పాక్షికంగా, నిజాయితీగా విచారణ జరపాలని కోరింది. గురువారం ఆమె ఓ వీడియోలో మాట్లాడుతూ, మాకు న్యాయం జరిగేంత వరకు పోరాటం ఆగదని తెలిపింది. 

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసు ఉత్కంఠకు గురి చేస్తుంది. ఆయనకు సంబంధించిన అనేక కొత్త విషయాలు బయటపడుతున్నాయి. విచారించే కొద్ది కొత్త కోణాలు బయటకు వస్తున్నాయి. ఇంతకి సుశాంత్‌ది ఆత్మహత్యా? హత్యా? అనే అనుమానాలను వారి కుటుంబం నుంచి ఉత్పన్నమవుతుంది.  

దీనిపై ముంబయి పోలీసులు, బీహార్‌ పోలీసులు విచారణ జరుపుతుండగా, సుశాంత్‌ ఫాదర్‌ కేకే సింగ్‌ ఈ కేసుని సీబీఐకి అప్పగించాలని బీహార్‌ ప్రభుత్వాన్ని కోరారు. బీహార్‌ ప్రభుత్వం సిఫార్సు మేరకు కేంద్రం ఈ కేసుని సీబీఐకి అప్పగించింది. మరోవైపు మనీ లాండరింగ్‌ కేసులో ఈడీ సైతం రంగంలోకి దిగి ఈ కేసులో ప్రధాన నింధితులురాలిగా భావిస్తున్న రియా చక్రవర్తి, వారి కుటుంబాన్ని ప్రశ్నించి కీలక  సమాచారాన్ని రాబట్టింది. 

ఇదిలా ఉంటే సుశాంత్‌ కేసుకు సంబంధించి తాజాగా ఆయన సోదరి శ్వేతా సింగ్‌ స్పందించారు. ఆమె తన సోదరుడి మృతి కేసుని నిష్పాక్షికంగా, నిజాయితీగా విచారణ జరపాలని కోరింది. గురువారం ఆమె ఓ వీడియోలో మాట్లాడుతూ, మాకు న్యాయం జరిగేంత వరకు పోరాటం ఆగదని తెలిపింది. జాతి మొత్తం ఏకతాటిపైకి వచ్చి సుశాంత్‌ కేసులో సీబీఐ విచారణ కోసం డిమాండ్‌ చేయాలని కోరింది. ఈ విషాదకర ఘటనకు సంబంధించిన వాస్తవాలను తెలుసుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉందన్నారు. నిజానిజాలు బయటపడితేనే సుశాంత్‌ కుటుంబం, అభిమానులు, శ్రేయోభిలాషులు ప్రశాంతంగా ఉంటారని తెలిపింది. 

సుశాంత్‌ కేసుని బీహార్‌ పోలీసులు కూడా విచారిస్తుండగా.. ఆ కేసుని ముంబయికి బదిలీ చేయాలని రియా చక్రవర్తి సుప్రీంకోర్ట్ ని ఆశ్రయించారు. దీనిపై కోర్ట్ తీర్పుని వెలువరించాల్సి ఉంది. కేసు కోర్ట్ లో ఉండగా సీబీఐ దర్యాప్తు జరపడం కుదరని రియా తెలిపిన విషయం తెలిసిందే. దీంతో ఇంకా సీబీఐ రంగంలోకి దిగలేదు. నేడు ఈ తీర్పు రానుంది.

click me!