`నొప్పి తెలియకుండా చావటం ఎలా..?` గూగుల్ వెతికిన సుశాంత్‌

By Satish ReddyFirst Published Aug 3, 2020, 6:57 PM IST
Highlights

సుశాంత్‌ సింగ్‌ జూన్‌ 14న ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు అంతా ఆత్మహత్యే అనుకున్నారు. కానీ తాజాగా ప్రముఖ డెర్మటాలజిస్ట్‌ డాక్టర్ మీనాక్షి మిశ్రా సుశాంత్‌ది హత్యే అంటూ ఓ వీడియోలో అధారాలతో సహా వెల్లడించింది. దీంతో ఆయన కేసు మరో కీలక మలుపు తీసుకుందని అంతా అనుకున్నారు. ఇంతలోనే ముంబయి పోలీసులు మరో సరికొత్త కోణాన్ని ఆవిష్కరించారు. 

చనిపోయే ముందు సుశాంత్‌ గూగుల్‌ సెర్చ్ చేశాడా? నొప్పి లేకుండా ఆత్మహత్య ఎలా చేసుకోవాలో గూగుల్‌లో వెతికి మరీ సూసైడ్‌ చేసుకున్నాడా? సుశాంత్‌ని హత్య కాదు, నిజంగానే ఆత్మహత్యా? అంటే అవుననే విషయాన్ని ముంబయి పోలీసులు వెల్లడిస్తున్నారు. తాజాగా సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ సెల్‌ఫోన్‌ని తనిఖీ చేయగా.. మరికొన్నికొత్త కోణాలు బయటపడ్డాయి. దీంతో సుశాంత్‌ డెత్‌ కేసు ఇప్పుడు మరో మలుపు తీసుకుంటుంది. 

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ జూన్‌ 14న ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు అంతా ఆత్మహత్యే అనుకున్నారు. కానీ తాజాగా ప్రముఖ డెర్మటాలజిస్ట్‌ డాక్టర్ మీనాక్షి మిశ్రా సుశాంత్‌ది హత్యే అంటూ ఓ వీడియోలో అధారాలతో సహా వెల్లడించింది. దీంతో ఆయన కేసు మరో కీలక మలుపు తీసుకుందని అంతా అనుకున్నారు. ఇంతలోనే ముంబయి పోలీసులు మరో సరికొత్త కోణాన్ని ఆవిష్కరించారు. ముంబై పోలీస్ కమిషనర్ పరమ్ భీర్ సింగ్ సోమవారం ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ, కీలక విషయాలను వెల్లడించారు. 

సుశాంత్‌‌కు, తన మాజీ మేనేజర్‌ దిషాకు సంబంధం ఉన్నట్లు వచ్చిన వార్తల పట్ల తీవ్ర మనస్తాపం చెందాడని, అలా వస్తున్న వార్తల గురించి సుశాంత్ గూగుల్‌లో వెతికాడని తెలిపారు. అంతేకాదు, నొప్పి తెలియకుండా ఎలా చనిపోవాలన్న దాని గురించి కూడా సుశాంత్ గూగుల్‌లో సెర్చ్ చేసినట్లు కమిషనర్ చెప్పారు. తన పేరును కూడా సెర్చ్ చేసి తనపై వస్తున్న వార్తల గురించి వెతికాడని తెలిపారు.  ఆత్మహత్య చేసుకున్న రెండు గంటల ముందు సుశాంత్ తన పేరును గూగుల్‌లో వెతికాడని చెప్పారు. ఈ విషయాలన్నీ సుశాంత్‌ మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్‌ ద్వారా ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్‌లో బయటపడ్డాయని కమిషనర్‌ పంచుకున్నారు.  

 సుశాంత్ చనిపోవడానికి ఐదు రోజుల ముందే ఆయన మాజీ మేనేజర్‌ దిశా ఆత్మహత్య చేసుకుంది. అనంతరం సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడం పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆమె మరణాన్ని అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. చనిపోవడానికి ముందు దిశా తన కాబోయే భర్త నివాసంలో జరిగిన పార్టీలో పాల్గొంది. వేకువ జామున 3 గంటలకు ఆమె ఆత్మహత్య చేసుకుందని, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా గుర్తించినట్లు ముంబై పోలీస్ కమిషనర్ చెప్పారు. ఆమెతో కలిపి మొత్తం ఐదుగురు ఈ పార్టీలో పాల్గొన్నట్లు ఆయన తెలిపారు.

ఇక సుశాంత్‌ వ్యక్తిగత వంట మనిషి నీరజ్‌ సింగ్‌ మరో విషయాన్ని వెల్లడించాడు. జూన్ 14 ఉదయం సుశాంత్ తన రూమ్ నుంచి బయటకు వచ్చి కూలింగ్ వాటర్ అడిగారు. అప్పుడు ఆయన కొంచెం టెన్షన్‌గా ఉన్నారు. నీరసంగా కనిపించారు. ముందు రోజు రాత్రి కూడా సుశాంత్ భోజనం చేయలేదు. ఆత్మహత్య చేసుకున్న రోజు ఉదయం టిఫిన్ గురించి సుశాంత్‌ను మరో వంట మనిషి కేశవ్ అడిగాడని, అందుకు కొబ్బరి నీళ్లు, ఓ అరటి పండు, జ్యూస్ మాత్రం ఇమ్మన్నారని, లంచ్‌కు ఏం చేయాలని అడిగితే.. రిప్లై ఇవ్వలేద`ని  నీరజ్ తెలిపారు. 

మరోవైపు సుశాంత్‌ మాజీ ప్రియురాలు రియా చక్రవర్తి మిస్సింగ్‌కి సంబంధించి ఆమె లాయర్‌ సతీష్‌ మనిషిండే స్పందించారు. రియా అదృశ్యమైనట్టు బీహార్‌ పోలీసుల ఆరోపణల్లో నిజం లేదు. అసలు పోలీసుల నుంచి రియాకి ఎలాంటి నోటీసులు రాలేదని, గతంలో విచారణకు సహకరించిందని లాయర్‌ తెలిపారు. ఆమె వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డ్ చేశారని స్పష్టం చేశారు. తప్పుడు ఆరోపణలపై లాయర్‌ మండిపడ్డటం విశేషం. ఇలా అనేక ట్విస్టులతో సుశాంత్‌ కేసు సాగుతుంది. మరి మున్ముందు ఇంకెన్నికొత్త ట్విస్టులు చోటు చేసుకుంటాయో చూడాలి. మొత్తానికి ఓ మంచి నటుడి మరణం విషయంలో ఇలాంటి గందరగోళం నెలకొనడం విచారకరం. 

click me!