సూర్య వర్సెస్‌ కార్తి, మల్టీ స్టారర్ చేయబోతున్న అన్నదమ్ములు, ఖైదీ సీక్వెల్ కు లైన్ క్లియర్

Published : Jun 05, 2022, 10:14 PM ISTUpdated : Jun 06, 2022, 08:35 AM IST
సూర్య వర్సెస్‌ కార్తి, మల్టీ స్టారర్ చేయబోతున్న అన్నదమ్ములు, ఖైదీ సీక్వెల్ కు లైన్ క్లియర్

సారాంశం

తమిళ్ యంగ్ హీరో కార్తి  ఖైదీ సినిమాతో అందరిని ఆశ్చర్యపరిచాడు. ఈమూవీ సైలెంట్ గా వచ్చి ప్రేక్షకులు మనసు దోచుకుంది. ఆడియన్స్ కు స్లోగా ఎక్కిన ఖైదీ... సినిమా ప్రేమికులకు మంచి కిక్ ఇచ్చింది. ఇక ఇప్పుడు ఈమూవీకి సీక్వెల్ ప్లానింగ్స్ జరుగుతున్నాయి.   

పెద్దగా ఖర్చులేదు. ఎక్కువ మంది ఆర్టిస్ట్ లతో పనిలేదు, సింపుల్ స్టోరీ.... మెస్మరైజ్ చేసే స్క్రీన్ ప్లే.. అన్ని అద్భుతంగా వర్కౌట్ అవ్వడంతో ఖైదీ మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో కార్తీ ఇమేజ్ తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఓ స్టెప్ పెరిగిందని చెప్పాలి. దాంతో ఇప్పుడు ఖైదీకి  పార్ట్ 2 ప్లాన్ చేస్తున్నారు. ఈసారి ఈసినిమాలో బిగ్ సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నారు. 

ఈ సినిమా కోసం భారీస్థాయిలో ఎలాంటి ఖర్చుటపెట్టలేదు. భారీ స్థాయిలో ఎలాంటి సెట్లు వేయలేదు. కథలో కనిపించేవి మూడే మూడు. ఒకటి పోలీస్ స్టేషన్ .. రెండోది గర్ల్స్ హాస్టల్ .. మూడోది విలన్ డెన్. విలన్ గ్యాంగ్ నుంచి పోలీసులను ఒక ఖైదీ కాపాడటమనే లైనే కొత్తగా ఉంటుంది.సినిమా మొత్తంలో ఆర్టిస్టులంతా సింగిల్ కాస్ట్యూమ్ తోనే కనిపిస్తారు. అయినా ఎక్కడా  బోర్ కొట్టించకుండా.. పాత వాసనలు తగలకుండా తెరకెక్కించారు ఖైదీ సినిమాను.

ఈ సినిమా ఇంత అద్భఉత విజయం సాధించింది కాబట్టే  దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కు మంచి పేరుతో పాటు వరుసగా స్టార్స్ సినిమాలను డైరెక్ట్ చేసే ఛాన్స్ కూడా వచ్చింది.  ఇక తనకు మంచి లైఫ్ ఇచ్చిన ఈ మూవీ  సీక్వెల్ చేయడానికి కార్తి సన్నాహాలు చేస్తున్నాడు. అయితే సర్ప్రైజింగ్ గా  ఈ సినిమాలో సూర్య కూడా నటిస్తున్నాడని తాజాసమాచారం. 

కోలీవుడ్ బ్రదర్స్ సూర్య, కార్తి కలసి నటిస్తే చూడాలని చాలా కాలంగా సౌత్ ఇండియా ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇన్నాళ్లకు వారి ఎదురు చూపులు ఫలించాయి. కమల్ హాసన్ నటించిన విక్రమ్ క్లైమాక్స్ లో ఖైదీ 2కు సంబంధించిన అఫీసియల్ లీడ్ ఇచ్చేశాడు దర్శకుడు లోకేష్ కనకరాజ్‌. అంతేకాదు సీక్వెల్ స్టోరీని కూడా కొంత లీక్ చేసాడు. ఈ సిక్వెల్‌ని అన్నదమ్ముల సవాల్‌గా మార్చాడు లోకేష్‌. ఖైదీ సీక్వెల్‌లో విలన్‌గా సూర్య, హీరోగా కార్తి నటించబోతున్నారు. 

వీరికి తోడు కమల్‌ హాసన్‌ కూడా గెస్ట్‌ రోల్‌  చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇదే కనుక జరిగితే..  ఖైదీ 2 బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయం. ఖైదీ సినిమాను నిర్మించిన ఎస్.ఆర్.ప్రభు ఈ సీక్వెల్ ను కూడా నిర్మించనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. సూర్య - కార్తి కలిసి ఈ హిట్ మూవీ సీక్వెల్లో నటిస్తే మరింత క్రేజ్ పెరుగుతుందని భావిస్తున్నారు. అయితే ఈసినిమా ఇప్పుడే పట్టాలెక్కే  అవకాశం కనిపించడం లేదు. విజయ్ తో సినిమా ప్లాన్ చేసుకున్న లోకేష్  ఆ తరువాత రామ్ చరణ్ తో సినిమా అనుకుంటున్నాడు. ఇటు సూర్య,కార్తి కూడా చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. సో ఈ సినిమా పట్టాలెక్కాలంటే ఓ రెడేళ్ళు ఆగాల్సిందే అంటున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode:అత్తను ఒప్పించిన దీప-సారీ చెప్పిన శౌర్య-కావేరికి దొరికిపోయిన శ్రీధర్
OTT లో ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాలు వెబ్ సిరీసులు, సస్పెన్స్,థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి పండగే..