బాలీవుడ్ లో రీమేక్ కానున్న సూర్య సురారై పోట్రు!

Published : Jul 12, 2021, 12:24 PM IST
బాలీవుడ్ లో రీమేక్ కానున్న సూర్య సురారై పోట్రు!

సారాంశం

సూర్య లేటెస్ట్ హిట్ మూవీ సూరారై పోట్రు హిందీలో రీమేక్ కానుంది. నేడు దీనిపై చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేశారు. అబండాన్టియా ఎంటర్ ప్రెజెస్, టూ డి ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.   

సౌత్ ఇండియా సినిమాలు బాలీవుడ్ లో అత్యంత ఆదరణ రాబడుతున్నాయి. అక్కడ హీరోలు సైతం సౌత్ లో సూపర్ హిట్ అయిన చిత్రాలు వరుసగా రీమేక్ చేస్తున్నారు. తాజాగా సూర్య లేటెస్ట్ హిట్ మూవీ సూరారై పోట్రు హిందీలో రీమేక్ కానుంది. నేడు దీనిపై చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేశారు. అబండాన్టియా ఎంటర్ ప్రెజెస్, టూ డి ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 


ఇక సూరారై పోట్రు చిత్రానికి దర్శకత్వం వహించిన సుధా కొంగర హిందీ వర్షన్ కి కూడా దర్శకత్వం వహించనున్నారు. హీరో సూర్య, సుధా కొంగర, జ్యోతికలతో చిత్ర నిర్మాతలు కలిసి అధికారిక ప్రకటన చేయడం జరిగింది. తెలుగు తమిళ భాషల్లో సూపర్ హిట్ గా నిలిచిన సురారై పోట్రు.. హిందీలో మరింత విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తుంది. 


డెక్కన్ ఎయిర్ వేస్ ఫౌండర్ జిఆర్ గోపినాధ్ జీవిత కథ ఆధారంగా సూరారై పోట్రు తెరకెక్కింది. లాక్ డౌన్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ లో నేరుగా విడుదల చేశారు. తెలుగులో ఆకాశం నీహద్దురా టైటిల్ తో విడుదల కావడం జరిగింది. ఇక టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు ఈ మూవీలో ఓ కీలక రోల్ చేశారు. 

PREV
click me!

Recommended Stories

Thalapathy Vijay సినిమా స్టోరీ లీక్, జన నాయగన్ కథ ఇదేనా? షాక్ లో మూవీ టీమ్
Pawan Kalyan కోసం రామ్ చరణ్ త్యాగం? పెద్ది రిలీజ్ పై మెగా అభిమానుల్లో ఆందోళన