పొలిటికల్ రీ ఎంట్రీపై రజినీకాంత్ క్లారిటీ...!

By team teluguFirst Published Jul 12, 2021, 11:44 AM IST
Highlights

రజినీకాంత్ ఫైనల్ గా తన పొలిటికల్ రీ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు. ఫ్యాన్స్ దశాబ్దాల నిరీక్షణకు తెరదింపుతూ తన చివరి నిర్ణయం ప్రకటించారు. 

రజినీకాంత్ రాకీయ ప్రవేశం ఎవర్ గ్రీన్ పొలిటికల్ టాపిక్. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా రజినీకాంత్ రాజకీయాలలోకి రావాలనే డిమాండ్ ఉంది. ఆయనను దేవునిగా పూజించే అభిమానులు రాజకీయ ప్రవేశం చేసి, సీఎం పీఠం అధిరోహించాలని కోరుకుంటున్నారు. ఈ విషయంలో రజినీకాంత్ అత్యంత ఒత్తిడికు గురవుతున్నాడు. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక సతమతం అవుతున్నారు. 

2017లో తన పొలిటికల్ ఎంట్రీ ప్రకటించిన రజినీకాంత్, 2021 అసెంబ్లీ ఎన్నికలలో మొత్తం స్థానాల్లో పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. 'రజినీ మక్కల్ మన్డ్రమ్' పేరుతో పార్టీని ప్రకటించడం జరిగింది. తీరా ఎన్నికలకు నెలల సమయం ఉండగా 2020లో తాను రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించి, ఫ్యాన్స్ గుండెల్లో బాంబ్ పేల్చారు. రజినీ నిర్ణయంపై ఫ్యాన్స్ వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఆయన నివాసం ముందు ధర్నాలు చేసి మరీ, రాజకీయాలలోకి రావాలని కోరారు. 

అయితే రజినీకాంత్ తాజా వ్యాఖ్యలు మరలా ఆయన రాజకీయాలలోకి వస్తారనే ఆశలు చిగురించేలా చేశాయి.  ''రాజకీయాలలోకి రావడం లేదని ప్రకటించిన తరువాత నేను ఆర్ ఎం ఎం ఆఫీస్ కి రాలేదు. సభ్యులతో మాట్లాడలేదు. అన్నాత్తే మూవీ షూటింగ్ డిలే కావడం, కరోనా సెకండ్ వేవ్, నా ఆరోగ్య పరీక్షల కోసం అమెరికా వెళ్లడం జరిగింది. అదే సమయంలో ఎన్నికలు కూడా వచ్చేశాయి. నేను రాజకీయాలలోకి వచ్చేది, లేనిది ఆర్ ఎం ఎం సభ్యులతో మాట్లాడి నిర్ణయిస్తాను'' అన్నారు. 

ఈ వ్యాఖ్యలు నేపథ్యంలో ఆయన మనసు మార్చుకొని రాజకీయాలలోకి వస్తారని అందరూ భావించారు. అయితే రజినీకాంత్ రాజకీయాల నుండి పూర్తిగా విరామం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇకపై రాజకీయాలలోకి వచ్చేది లేదని తేల్చిచెప్పారు. అలాగే తాను స్థాపించిన రజినీ మక్కల్ మాన్డ్రమ్ పార్టీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీనితో రజినీకాంత్ ఫ్యాన్స్ దింపుడుకల్లం ఆశలు గల్లంతు అయ్యాయి. 
 

click me!