సూర్య ‘కంగువ’స్టోరీ లైన్ ఇదే , సూపర్ గా ఉందే

By Surya Prakash  |  First Published Mar 21, 2024, 10:32 AM IST

ఈ మూవీ కథ మొత్తం మూడు టైం పీరియడ్స్ తో ఉండబోతుందని సమాచారం. 



 తమిళ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో రూపొందుతున్న భారీ చిత్రం కంగువ. ఈ  సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్న సంగతి తెలిసిందే. మొదటి నుంచి ఈ చిత్రం టీమ్ ఓ ప్లానింగ్ ప్రకారం ప్రమోషన్స్ చేస్తూ వస్తోంది. ఫస్ట్ లుక్, గ్లింప్స్ ఇలా ప్రతీ విషయంలోనూ ఈ మూవీ సినీ ప్రేక్షకులను ఎగ్జైట్ చేస్తోంది. ఫ్యాంటసీ యాక్షన్ మూవీగా భారీ బడ్జెట్‍తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో సూర్య డిఫరెంట్ గెటప్‍లో యోధుడిగా నటిస్తున్నారు. కాగా, కంగువ చిత్రం నుంచి నేడు (మార్చి 19) టీజర్ విడుదలైంది. హైప్‍ను  ఈ   టీజర్ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం కథేంటి అనేది ఆసక్తికరమైన విషయంగా మారింది. ఆ స్టోరీ లైన్ తమిళ సినీ వర్గాల ద్వారా బయిటకు వచ్చింది. అదేంటో చూద్దాం.

ఈ చిత్రం కథ ఓ గిరిజన యోధుడు చుట్టూ తిరుగుతుంది. అతను 1678 నుంచి ఈ కాలానికి వస్తాడు. అతను ఓ మహిళా సైంటిస్ట్ సాయింతో తన మిషన్ ని పూర్తి చేయాలనుకుంటాడు. ఆ మిషన్ ఏమిటి...ఆ కాలం నుంచి ఇప్పటి కాలానికి అతను టైమ్ ట్రావెల్ ఎలా చేసారనేదే కథ. గతంలో ట్రైమ్ ట్రావెల్ కాన్సెప్టుతో సూర్య ఓ చిత్రం చేసారు. ఆ సినిమా పేరు 24. ఇప్పుడు కూడా టైమ్ ట్రావెల్ తో రెండు విభిన్న కాలాలలో ఈ సినిమా జరుగుతుంది. ప్రైమ్ వీడియో వారు ఈ చిత్రం రైట్స్ ని భారీ మొత్తానికి కొనుగోలు చేసారు. ఈ నేపధ్యంలో చిత్రం గురించి చెప్తూ ఈ ప్లాట్ ని రివీల్ చేసారు. 

Latest Videos

ఈ మూవీ కథ మొత్తం మూడు టైం పీరియడ్స్ తో ఉండబోతుందని సమాచారం. భూత భవిష్యత్తు వర్తమాన కాలాలతో ఈ సినిమాని ఆడియన్స్ కి చూపించబోతున్నారు. మరి మిగిలిన ఆ మూడు కాలాల పాత్రలకు సంబంధించిన టీజర్ లు కూడా త్వరలో వస్తాయేమో చూడాలి. ఈ సినిమాని 3Dలో మొత్తం 38 భాషల్లో రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధం చేస్తున్నారు. అయితే ఎప్పుడు రిలీజ్ చేస్తారు అన్న విషయాన్ని మాత్రం ఇంకా తెలియజేయలేదు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
  
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, తమిళ మాస్ డైరెక్టర్ శివతో కలిసి తెరకెక్కిస్తున్న ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘కంగువ’. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా చిత్రంగా రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో లాంగ్ హెయిర్‌తో సూర్య ఇంటెన్స్ గెటప్‍తో ఉన్నారు. ఓ తెగకు నాయకుడిగా ఆయన ఉండనున్నట్టు ఈ టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఆయన కత్తితో తెగనరికే సీన్లు అద్భుతంగా ఉన్నాయి. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కూడా క్రూరంగా భయంకరమైన పాత్ర చేస్తున్నట్టు అర్థమవుతోంది. సూర్య, సన్నీ ఎదురెదురుగా గట్టిగా అరిచే షాట్‍తో కంగువ టీజర్ ఎండ్ అయింది. అద్భుతమైన విజువల్స్, డైరెక్టర్ శివ టేకింగ్, భారీ యాక్షన్ సీక్వెన్స్, సూర్య, బాబీ డియోల్ సూపర్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో కంగువ టీజర్ ఆశ్చర్యపరిచేలా ఉంది.

click me!