హమ్మయ్య, ఫ్యాన్స్ కి బిగ్ రిలీఫ్.. గాయం తర్వాత తొలిసారి స్పందించిన సూర్య

By Asianet NewsFirst Published Nov 23, 2023, 8:51 PM IST
Highlights

సూర్య డైరెక్టర్ శివ దర్శకత్వంలో 'కండువ' అనే భారీ పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సూర్య కెరీర్ లో భారీ అంచనాలతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. 

హీరో సూర్యకి తమిళంలో ఎంత క్రేజ్ ఉందో తెలుగులో కూడా అదే స్థాయిలో అభిమానులు ఉన్నారు. రజనీ తర్వాత ఈ ఘనత దక్కించుకున్న తమిళ హీరోల్లో సూర్య ఒకరు. గజిని, సింగర్ సిరీస్, సూర్య సన్నాఫ్ కృష్ణన్ లాంటి చిత్రాలతో తెలుగులో కూడా సూర్యకి భారీ క్రేజ్ ఏర్పడింది. 

ప్రస్తుతం సూర్య డైరెక్టర్ శివ దర్శకత్వంలో 'కండువ' అనే భారీ పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సూర్య కెరీర్ లో భారీ అంచనాలతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. సూర్య ఈ చిత్రంలో యుద్ధ వీరుడిగా కనిపించబోతున్నాడు. 

Latest Videos

అయితే ఈ చిత్ర షూటింగ్ లో నేడు సూర్య గాయపడిన సంగతి తెలిసిందే. షూటింగ్ జరుగుతున్న సమయంలో కెమెరా హ్యాండిల్ సూర్య భుజానికి బలంగా తాకింది. దీనితో సూర్య గాయపడ్డాడు. వెంటనే చిత్ర యూనిట్ ఆసుపత్రికి తరలించారు. సూర్య ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడు అనే న్యూస్ రాగానే ఏమైంది అంటూ ఫ్యాన్స్ ఆందోళన చేశారు. 

Dear Friends, well wishers & my
Heartfelt thanks for the outpouring ‘get well soon’ msgs.. feeling much better.. always grateful for all your love :)

— Suriya Sivakumar (@Suriya_offl)

సూర్యకి గాయం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చిత్ర యూనిట్ చెబుతున్నా ఫ్యాన్స్ లో ఆందోళన ఆగలేదు. దీనితో సూర్య త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. అయితే చికిత్స తర్వాత హీరో సూర్య తొలిసారి స్పందిస్తూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. 'మిత్రులు, శ్రేయోభిలాషులు , నా ప్రియమైన అభిమానులు అందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరంతా నేను త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. నేనిప్పుడు బాగానే ఉన్నా, కోలుకుంటున్నా. మీ ప్రేమకి రుణపడి ఉంటా అని పోస్ట్ చేశారు. స్వయంగా సూర్య సాధించడంతో ఫ్యాన్స్ హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుంటున్నారు. 

 

click me!