న్యూజిలాండ్ నుంచి తిరిగొచ్చిన సురేఖ వాణి.. కూతుర్ని చూడగానే ఎయిర్ పోర్ట్ లో రచ్చ రచ్చ చేసిందిగా, వీడియో 

Published : Nov 23, 2023, 06:27 PM IST
న్యూజిలాండ్ నుంచి తిరిగొచ్చిన సురేఖ వాణి.. కూతుర్ని చూడగానే ఎయిర్ పోర్ట్ లో రచ్చ రచ్చ చేసిందిగా, వీడియో 

సారాంశం

మంచు విష్ణు నటిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం కన్నప్పలో సురేఖ వాణి కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కన్నప్ప షూటింగ్ లో పాల్గొనేందుకు గత నెలరోజులుగా సురేఖ వాణి న్యూజిలాండ్ లోనే ఉంటోంది.

నటి సురేఖ వాణి గురించి పరిచయం అక్కర్లేదు. తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సురేఖ వాణి రాణిస్తోంది. తన కుమార్తె సుప్రీతతో కలసి సురేఖ వాణి సోషల్ మీడియాలో చేసే హంగామా అంతా ఇంతా కాదు. తల్లీకూతుళ్లు ఇద్దరూ డాన్స్ చేసే వీడియోల్ని, గ్లామరస్ ఫొటోస్ ని తరచుగా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. 

కొన్ని సార్లు తమ పోస్ట్ వల్ల సురేఖ వాణి, సుప్రీత ట్రోలింగ్ ట్రోలింగ్ కి గురవుతుంటారు. అయితే మితిమీరిన కామెంట్స్ కి మాత్రం సురేఖ వాణి, సుప్రీత కౌంటర్ ఇవ్వడం చూశాం. తాజాగా సురేఖ వాణి కుమార్తె సుప్రీత సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

మంచు విష్ణు నటిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం కన్నప్పలో సురేఖ వాణి కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కన్నప్ప షూటింగ్ లో పాల్గొనేందుకు గత నెలరోజులుగా సురేఖ వాణి న్యూజిలాండ్ లోనే ఉంటోంది. ఈ చిత్ర షూటింగ్ మొత్తం న్యూజిలాండ్ లోనే జరుగుతోంది. 

దీనితో నటీ నటులందరినీ మోహన్ బాబు న్యూజిలాండ్ తరలించారు. తన పార్ట్ షూటింగ్ పూర్తి కావడంతో సురేఖ వాణి నేడు ఇండియా తిరిగి వచ్చింది. ఈ నెలరోజులు సుప్రీతా తల్లికి దూరంగా గడిపింది. వీళ్ళిద్దరూ ఎంత అన్యోన్యంగా ఉంటారో చెప్పనవసరం లేదు. తల్లి కూతుళ్లే అయినప్పటికీ క్లోజ్ ఫ్రెండ్స్ లాగా ఎంజాయ్ చేస్తుంటారు. 

ఎట్టకేలకు సురేఖ వాణి ఇండియాకి రావడంతో సుప్రీతా రిసీవ్ చేసుకునేందుకు ఎయిర్ పోర్ట్ వెళ్ళింది. అక్కడ తల్లి కూతుళ్లు ఒకరినొకరు చూసుకుని సంతోషంతో పెద్ద హంగామానే చేసారు. ఈ దృశ్యాలని సుప్రీతా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 

PREV
click me!

Recommended Stories

Renu Desai ని రిజెక్ట్ చేసిన తెలుగు స్టార్‌ హీరో ఎవరో తెలుసా? బద్రి కంటే ముందే ఇంత కథ జరిగిందా?
Krishnam Raju: చిరంజీవి ఇలా మనసు పడ్డాడో లేదో, మెడలో ఖరీదైన గిఫ్ట్ పెట్టిన కృష్ణంరాజు.. మర్చిపోలేని బర్త్ డే