చదువులో దూసుకుపోతున్న సూర్య కూతురు, గ్రాడ్యుయేషన్ వేడుకలో స్టార్ హీరో దంపతుల సందడి

Published : May 31, 2025, 12:30 PM IST
Suriya attends daughter Diya graduation event with Jyothika

సారాంశం

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సినిమాలతో పాటు వ్యక్తిగత జీవితం, ఫ్యామిలీకి కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. తాజాగా ఆయన కుటుంబంతో దిగిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కారణం – ఆయన కూతురు దియా స్కూల్ గ్రాడ్యుయేషన్ వేడుక.

 

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సూర్య, తన కూతురు దియా ఇంటర్మీడియెట్ గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి ప్రత్యేకంగా హాజరయ్యారు. ఈ వేడుకలో సూర్య తన భార్య, ప్రముఖ నటి జ్యోతికతో కలిసి పాల్గొన్నారు. వీరిద్దరూ తమ కుమార్తెతో కలిసి ఫోటోల కోసం పోజులు ఇచ్చారు. ఈ ఫ్యామిలీ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్‌గా మారింది.

మీడియా సమాచారం ప్రకారం, దియా తన 12వ తరగతిలో 600కి 581 మార్కులు సాధించి అద్భుత ప్రతిభను చూపింది. ఆమె చదివిన పాఠశాలలో గ్రాడ్యుయేషన్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకలో కుటుంబ సభ్యుల సమక్షంలో దియా సత్కారం కూడా అందుకుంది.

గతంలో చెన్నైలో నివసించిన సూర్య కుటుంబం ఇప్పుడు ముంబైకి షిప్ట్ అయ్యింది. ఈ విషయాన్ని ఇటీవలే సూర్య స్వయంగా వెల్లడించారు. తమ పిల్లలు దియా, దేవ్ స్టడీస్ లో మెరుగైన అవకాశాల కోసం ముంబైకి షిఫ్ట్ అయ్యామని చెప్పారు. ప్రస్తుతానికి వారిద్దరూ ముంబైలోని టాప్ స్యూల్ లో చదువుతున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. సూర్య ప్రస్తుతం దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న కొత్త చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో సూర్య సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక సమాచారం త్వరలో వెలువడనుంది.

ఈమధ్య కాలంలో 'కంగువ' వంటి భారీ బడ్జెట్ మూవీ రిలీజ్ అయ్యింది. కాని ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. అంతేకాదు, ఆయన నటించిన ఓ రెట్రో సినిమా కూడా మిశ్రమ స్పందనను మాత్రమే సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో సూర్య తన తదుపరి సినిమాలపై మరింత శ్రద్ధ పెట్టుతున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Illu Illalu Pillalu Today డిసెంబర్ 06 ఎపిసోడ్ : రామరాజు గ్రీన్ సిగ్నల్.. వల్లికి ఉద్యోగం తిప్పలు, ఇరికించిన నర్మద, ప్రేమ
Superstar Krishna హీరోగా పూరీ జగన్నాథ్‌ ఫస్ట్ మూవీ ఎలా ఆగిపోయిందో తెలుసా? రెండు సార్లు చేదు అనుభవం