Scene Advance Booking: సూర్య వరుస హిట్ల ఎఫెక్ట్.. అడ్వాన్స్ బుకింగ్స్ లో 'సీన్' జోరు

Published : Nov 04, 2026, 12:41 PM IST
Suriya

సారాంశం

నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సూర్య, నజ్రియా నజీమ్ 'సీన్' సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ మూవీ ట్రైలర్, బుకింగ్స్, సూర్య కామెంట్స్ గురించి ఇక్కడ తెలుసుకోండి.

సూర్య, నజ్రియా నజీమ్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'సీన్'. ఈ క్రైమ్ కామెడీ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తమిళ స్టార్ హీరో, మలయాళ బ్యూటీ కలిసి నటిస్తున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం. అలాగే మలయాళ డైరెక్టర్ జితు మాధవన్ ఈ సినిమాతోనే తమిళ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ట్రైలర్, క్యాస్టింగ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండటంతో ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాల్లో దీనిపైనే భారీ అంచనాలు ఉన్నాయి.

'సీన్' అడ్వాన్స్ బుకింగ్స్

సాక్నిల్క్ (Sacnilk) రిపోర్ట్ ప్రకారం.. మొదట ఈ సినిమాకు 4834 టికెట్లు అమ్ముడవగా, రూ.8.64 లక్షల కలెక్షన్స్ వచ్చాయి. కానీ ఆ తర్వాత బుకింగ్స్ ఒక్కసారిగా పుంజుకున్నాయి. నవంబర్ 3 సాయంత్రం నాటికి 3 రోజుల షోలకు సంబంధించి ఏకంగా 17,971 టికెట్లు అమ్ముడయ్యాయి. దీంతో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రూ.26.03 లక్షలు వసూలు చేసింది. దీన్ని బట్టి చూస్తే సినిమాపై జనాల్లో ఎంత ఆసక్తి ఉందో అర్థం చేసుకోవచ్చు.సూర్య ఇటీవల వీర భద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకున్నాడు. ఆ సినిమాల పాజిటివ్ ఎఫెక్ట్ కూడా సీన్ పై ఉంది.

సినిమా కథ ఏంటి?

ఈ సినిమాలో సూర్య డీఎస్పీ ఇన్‌బరాజ్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. సడెన్‌గా తన ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి రావాలని అతను అనుకుంటాడు. సరిగ్గా అదే సమయంలో ఈశ్వరన్ (నస్లెన్) అనే ఓ డేంజరస్ క్రిమినల్ అతనికి ఎదురుపడటంతో కథ మలుపు తిరుగుతుంది. ఇక నజ్రియా ఇందులో మాయ అనే హౌస్ కీపర్ పాత్రలో నటిస్తోంది. ఆమె క్యారెక్టర్‌లో ఓ ఊహించని ట్విస్ట్ ఉంటుందని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. మొత్తానికి క్రైమ్, యాక్షన్, కామెడీతో ఈ సినిమా రాబోతోంది.

నజ్రియాతో తొలిసారి..

ఇటీవల జరిగిన ఆడియో లాంచ్ ఈవెంట్‌లో సూర్య ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. గతంలో తన మూడు సినిమాల్లో నటించేందుకు నజ్రియా నో చెప్పిందని, కానీ ఈ సినిమాకు మాత్రం వెంటనే ఓకే చెప్పిందని అన్నాడు. అలాగే డైరెక్టర్ జితు మాధవన్ స్టోరీ చెప్పే విధానం చాలా కొత్తగా ఉంటుందని మెచ్చుకున్నాడు. 'రోమాంచం', 'ఆవేశం' లాంటి హిట్ సినిమాలను తీసిన జితు మాధవన్‌కు తమిళంలో ఇదే తొలి సినిమా. సూర్య, జ్యోతిక తమ సొంత బ్యానర్లు ఝగరం స్టూడియోస్, 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జైశ్రీ దామోదరన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఈ సినిమా 2026 నవంబర్ 6న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Jailer 2 Box Office: పుష్ప 2 కలెక్షన్స్ బ్రేక్ చేసిన జైలర్ 2.. రజనీకాంత్‌ దెబ్బకి అక్కడ బాక్సాఫీస్‌ షేక్‌
Diwali 2026 OTT Releases: దీపావళికి సినిమాల జాతర, ఓటీటీలో సందడి చేయనున్న 10 కొత్త సినిమాలు ఇవే