'సైరా'కి నిజమైన హీరో రాంచరణే.. సురేందర్ రెడ్డి!

By tirumala ANFirst Published Sep 9, 2019, 3:03 PM IST
Highlights

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహారెడ్డి మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అక్టోబర్ 2న సౌత్ ఇండియన్ అన్ని భాషలు, హిందీలో భారీ ఎత్తున రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. విడుదల సమయం దగ్గర పడుతుండడంతో ప్రచార కార్యక్రమాలు జోరందుకుంటున్నాయి. 

తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. 200  కోట్లకు పైగా బడ్జెట్ తో రాంచరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. ఇప్పటికే విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. నయనతార హీరోయిన్ గా, అమితాబ్ బచ్చన్, తమన్నా, విజయ్ సేతుపతి, జగపతి బాబు, కిచ్చా సుదీప్ కీలక పాత్రల్లో నటిస్తుండడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. 

తాజాగా సురేందర్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలు మాట్లాడుతూ రాంచరణ్ గురించి ప్రస్తావించాడు. సైరా బడ్జెట్ విషయంలో రాంచరణ్ వెనకడుగు వేయలేదు. బడ్జెట్ విషయంలో నాకు కూడా ఎలాంటి షరతులు విధించలేదు. రాంచరణ్ ఈ చిత్రాన్ని తన తండ్రికి బహుమతిగా అందించాలనుకుంటున్నాడు. అందుకే ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాని తెరకెక్కించాలని చెప్పాడు. 

ఒకరకంగా చెప్పాలంటే సైరా చిత్రానికి నిజమైన హీరో రాంచరణ్ అని సురేందర్ రెడ్డి ప్రశంసించాడు. మెగాస్టార్ చిరంజీవి ఈ తరహా చిత్రంలో నటించడం ఇదే తొలిసారి. హిందీలో ఈ చిత్రాన్ని ప్రముఖ నటుడు ఫరాన్ అక్తర్ తన ఎక్సయిల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై హిందీలో రిలీజ్ చేస్తున్నాడు. 

మెగాస్టార్ నటిస్తున్న చిత్రం కాబట్టి తెలుగులో భారీ ఓపెనింగ్స్ వస్తాయి. ఇక హిందీతో పాటు ఇతర భాషల్లో ఈ చిత్రం ఎలా రాణిస్తుందనే ఆసక్తి నెలకొని ఉంది. 

click me!