కౌశల్ బిగ్ బాస్ టైటిల్ గెలుస్తాడా..? బాబు గోగినేని ఏమంటున్నాడంటే!

Published : Aug 16, 2018, 12:44 PM ISTUpdated : Sep 09, 2018, 11:32 AM IST
కౌశల్ బిగ్ బాస్ టైటిల్ గెలుస్తాడా..? బాబు గోగినేని ఏమంటున్నాడంటే!

సారాంశం

నేను పక్కాగా చెప్పగలను కౌశల్ ఫైనల్స్ వరకు వెళ్తాడని. అందులో ఎలాంటి సందేహం లేదు. ఆయనకు సపోర్ట్ కూడా బాగుంది. నేను బయటకి వచ్చే సమయంలో నాకు అర్ధమైంది హౌస్ మేట్స్ లో అతడికి మంచి సపోర్ట్ ఉందని. మీకు అన్యాయం జరిగిందని హౌస్ లో ఉన్న ఆడవాళ్లతో అంటే మాకేం జరగలేదు అన్నట్లుగా మాట్లాడారు

బిగ్ బాస్ హౌస్ లో దాదాపు అరవై రోజుల పాటు తన ప్రయాణాన్ని కొనసాగించి గత వారం బయటకి వచ్చేశాడు బాబు గోగినేని. బిగ్ బాస్  హౌస్ నుండి ఎలిమినేట్ అయిన తరువాత బాబు గోగినేని ఈ షోపై అలానే హౌస్ మేట్స్ మీద కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. హౌస్ లో ఉన్నప్పుడు బాబు గోగినేని.. కౌశల్ ని టార్గెట్ చేశారు. అతడిని హౌస్ నుండి పంపించేయాలని కూడా అనుకున్నారు.

అయితే తాను కౌశల్ ని టార్గెట్ చేయలేదని నిరసన తెలిపానని బాబు గోగినేని అన్నారు. ఇక బిగ్ బాస్ టైటిల్ ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారనే ప్రశ్నకు జవాబుగా.. 'నేను పక్కాగా చెప్పగలను కౌశల్ ఫైనల్స్ వరకు వెళ్తాడని. అందులో ఎలాంటి సందేహం లేదు. ఆయనకు సపోర్ట్ కూడా బాగుంది. నేను బయటకి వచ్చే సమయంలో నాకు అర్ధమైంది హౌస్ మేట్స్ లో అతడికి మంచి సపోర్ట్ ఉందని.

మీకు అన్యాయం జరిగిందని హౌస్ లో ఉన్న ఆడవాళ్లతో అంటే మాకేం జరగలేదు అన్నట్లుగా మాట్లాడారు. కౌశల్ ని వారు సపోర్ట్ చేస్తున్నారనేదానికి ఇదొక ఉదాహరణ. ప్రజల్లో కూడా ఆయనకు సపోర్ట్ ఉందని ఓట్ల ద్వారా తెలుస్తోంది. ఆయన్ను గెలవనివ్వండి. ఎవరో ఒకరు గెలవాలి కదా' అంటూ వెల్లడించారు.   

PREV
click me!

Recommended Stories

జూనియర్ ఎన్టీఆర్ కు ఇరిటేషన్ తెప్పించి, బీపీ పెరిగిపోయేలా చేసిన డైరెక్టర్ ఎవరో తెలుసా? తారక్ ఏం చేశాడంటే?
Thanuja: ఇదీ తనూజ అసలు స్వరూపం, విన్నర్ అయ్యే ఛాన్స్ గోవిందా.. ఆమెకి ఎలివేషన్స్ ఇచ్చి వేస్ట్