రజనీకాంత్ అభిమానులకు శుభవార్త, రీరిలీజ్ కాబోతున్న సూపర్ స్టార్ క్రేజీమూవీ

By Mahesh JujjuriFirst Published Nov 22, 2022, 9:20 AM IST
Highlights

సూపర్ స్టార్ రజనీ కాంత్ అభిమానులకు త్వరలో ఓ గుడ్ న్యూస్ రాబోతున్నట్టు సూచనలు అందుతున్నాయి. ఆయన క్రేజీ మూవీ.. ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సినిమా రీ రిలీజ్ కు రెడీ అవుతున్నట్టు సమాచారం.  

సూపర్ స్టార్ రజినీకాంత్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమా అంటే అది హిట్.. ప్లాప్ అని లేదు. అన్నింటికి అతీతంగా ఉంటుంది. సినిమా ఎలా ఉన్నా.. రజనీ ఉన్నాడన్న కారణంతో ఆ మూవీకి హైప్ ఇస్తారు. ఫ్యాన్స్ కూడా తలైవా ప్రతీ మూవీని నెత్తిన పెట్టుకుని మోస్తుంటారు. అటువంటిది ఫ్యాన్స్ కు సూపర్ స్టార్ త్వరలో గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడట.

 ప్రస్తుతం నెల్సన్ దిలీప్‌ కుమార్ డైరెక్షన్ లో  జైలర్ సినిమా చేస్తున్నాడు తలైవా. ఈ మూవీ షూటింగ్ జోరుగా సాగుతున్న వేళ.. సూపర్ స్టార్ అభిమానులను దిల్ ఖుష్ చేసేలా.. ఓ వార్త నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. తమిళ స్టార్ హీరో కెరీర్ లో వెరీ స్పెషల్ మూవీగా.. ఆయన జీవితానికి కాస్త దగ్గరగా అనిపించిన సినిమా బాబా. ఈ సినిమా మరోసారి ఆడియన్స్ ముందుకు రాబోతున్నట్టు తెలుస్తోంది. ఈ న్యూస్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. 

 

produced directed by is gearing up for Re-Release in a new avatar! will be digitally enhanced with a re-edit and new look!
COMING SOON! pic.twitter.com/fudJaM4j1y

— Sreedhar Pillai (@sri50)

20 ఇయర్స్ వుతుంది బాబా సినిమా రిలీజ్ అయ్యి.. ఇక ఈ సందర్భంతో పాటు.. సూపర్ స్టార్ పుట్టిన రోజును పురస్కరించుకుని.. ఆయన జీవితానికి దగ్గరగా ఉండే బాబా సినిమాను  బాబా చిత్రాన్ని థియేటర్లలో రీరిలీజ్‌ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. అంతే కాదు మరో శుభవార్త ఏంటీ అంటే..? ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించేలా బెస్ట్ క్వాలిటీతో  ఈ సినిమాను  రీఎడిట్‌ చేస్తున్నట్టు కోలీవుడ్ సర్కిల్ టాక్‌. 

సురేశ్ కృష్ణ డైరెక్షన్‌లో వచ్చిన బాబా చిత్రం బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. రజనీ అభిమానులతో పాటు.. ఆడియన్స్ అందరిని ఈ మూవీ నిరాశపరిచింది. ఇక కాస్త అటూ ఇటు తేడాతో..  కొత్త వెర్షన్‌లో బాబాను విడుదల చేయబోతున్నారట మేకర్స్ . అంతే కాదు బాబా చిత్రంలోని పాటలను డోల్బీ మిక్స్ సౌండ్‌తో రీమాస్టర్డ్‌ వెర్షన్‌ సిద్దం చేస్తున్నట్టు సమాచారం. తలైవా పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను ఫ్యాన్స్ ముందుకు తీసుకువచ్చే ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. 

ఇక ఈసినిమాకు మరో విశేషం ఏంటీ అంటే...బాబా  సినిమాకు సూపర్ స్టార్  రజినీకాంత్ స్వయంగా కథ-స్క్రీన్‌ ప్లే అందించడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించారు. అప్పట్లో బాబా నష్టాలను పూడ్చేందుకు డిస్ట్రిబ్యూటర్లకు పెట్టుబడిలో 25 శాతాన్ని తిరిగిచ్చారు రజినీకాంత్‌. తన మంచి మనసును చాటుకుని.. తమిళుల ఆరాధ్య దైవంగా మారిపోయారు. 

click me!