
సూపర్‌స్టార్ రజనీకాంత్ జీవితం లో ఆధ్యాత్మిక భావాలు చాలా ఎక్కువ.. ఆ విషయం అందరికి తెలిసిందే. మరీ ముఖ్యంగా ఆయన మానసిక ప్రశాంతత కోసం ఆయన ప్రతీ ఏటా హిమాలయాలను సందర్శిస్తారు. అక్కడ ధ్యానం చేసి.. ప్రశాంతతను పొందుతారు. ఆయన హిమాలయాల దర్శనం గురించి రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. కాని ఆయన వెళ్లడం వరకే అందరికి తెలిసింది. అక్కడ ఏం జరుగుతుంది. ఏం చేస్తారు అనే విషయాలు మొత్తంగా క్లారిటీ లేదు.
రజనీకాంత్ సినిమాల రిలీజ్ లు ఉంటే.. రిలీజ్ కు ముందే హిమాలయాలకు వెళ్తారు. రిలీజ్ రోజు ఆయన అక్కడే ఉంటేట్టు చూసుకుంటారు. ఇక కరోనా వల్ల గత నాలుగు సంవత్సరాలు హిమాలయాలకు దూరంగా ఉన్న రజినీ తన తాజా సినిమా జైలర్ రిలీజ్ కు ముందు హిమాలయాలకు వెళ్లారు. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కించిన తాజా చిత్రం జైలర్. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా గురువారం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
జైలర్ సినిమా విడుదలకు ఒకరోజు ముందు హిమాలయాల యాత్రకు బయలుదేరిన రజనీకాంత్ .. శనివారం బద్రీనాథుని దర్శించుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. చార్‌ధామ్ పుణ్యక్షేత్రమైన బద్రీనాథ్‌లో బద్రీనాథీశ్వరుడి దర్శనం అనంతరం ఆయన అభిమానులతో కాసేపు మాట్లాడారు.. కలర్ ఫుల్ స్వెట్టర్ లో డిఫరెంట్ గా ఉన్న రజనీకాంత్ ను గుర్తు పట్టి.. ఫోటోలు దిగడానికి అక్కడి అభిమానులు పోటీపడ్డారు. ఇక అందులో కొన్ని ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
ఇక జైలర్ విషయానకి వస్తే.. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన ఈసినిమా బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది. తలైవాకు అదరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చింది మూవీ. కలెక్షన్‌లు కొల్లగొడుతోంది. ముత్తువేల్ పాండ్యన్ అనే రిటైర్డ్ పోలీస్ అధికారి పాత్రలో రజినీ నటించారు. ఫస్ట్ 3 డేస్ లోనే ఈసినిమా 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.