ఆవిషయంలో జయలలితతో రజినీకాంత్ కు విబేధాలు? స్వయంగా వెల్లడించిన సూపర్ స్టార్!

Published : Feb 25, 2023, 03:05 PM IST
ఆవిషయంలో జయలలితతో రజినీకాంత్ కు విబేధాలు? స్వయంగా వెల్లడించిన సూపర్ స్టార్!

సారాంశం

దివంగత నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితపై తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ షాకింగ్ కామెంట్స్ చేశారు. జయలలితతో తన ఆవిషయంలో విబేధాలు ఉండేవని అంగీకరించారు. ఇందుకు సంబంధించిన విషయాలను చెప్పుకొచ్చారు.   

నాలుగు దశాబ్దాలుగా దక్షిణాది ప్రేక్షకులను అలరిస్తున్నారు సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth). ఈసందర్భంగా తన సినీ కేరీర్ లో ఎంతో మంది తారలతో కలిసి నటించారు. ఈక్రమంలో వారితో మంచి అనుబంధమూ ఏర్పడి ఉంది. ఈక్రమంలో దివంగత నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత (Jayalalitha)తోనూ మంచి సంబంధాలు ఉండేవి. నిన్న జయలలిత  75వ పుట్టనరోజు కావడంతో ఆమె అభిమానులు, ప్రజాప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు. ఈప్రత్యేకమైన రోజున సినీ తారలూ ఆమె ఉన్నజ్ఞాపకాలను సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా పంచుకుంటున్నారు. 

ఈ సందర్బంగా సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా జయలలితకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. జె జయలలితను ఆమె పుట్టిన రోజున ఆయన ప్రశంసించారు. అయితే  ఓ ఛానెల్‌ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో జయలలిత గురించి మాట్లాడారు. భారతదేశ చరిత్రలో ప్రముఖ రాజకీయ నాయకులలో ఒకరిగా ఆమె కూడా స్థానం సంపాదించుకోవడం గొప్ప విషయం అన్నారు. కానీ జె జయలలితతో విభేదాలు కూడా ఉన్నాయన్నారు. అవి కేవలం సిద్ధాంతపరమైన విభేదాలు మాత్రమేనని తెలిపారు. ఎందుకంటే ఇద్దరూ వేర్వేరు సూత్రాలను అనుసరించడం మూలంగా ఘర్షణలు తలెత్తాయని తెలిపారు. రజినీకాంత్ తాజాగా చేసిన కామెంట్లు ఆసక్తికరంగా మారాయి. 

అయితే జయలలిత మాత్రం తన కుమార్తె వివాహాం సందర్భంగా ఇంటికి వచ్చి మరీ రజినీకాంత్ ను ఆహ్వానించినట్టు తెలిపింది. తానూ మర్యాదపూర్వకంగానే పలకరించారని రజనీ వెల్లడించారు. జయలలిత కూడా రజనీకాంత్ కుమార్తె వివాహ వేడుకలో పాల్గొన్నారని తెలిపారు. ఎప్పుడూ గర్వం చూపించే వారు కాదని జయలలితను కొనియాడారు. అందుకే ఆమెను గర్వంలేని వ్యక్తిగా భావిస్తానని చెప్పుకొచ్చారు. జయలలిత పుట్టిన రోజున ఇలా ఆమెతో ఉన్న జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. జయలలిత 2002 నుంచి 2006 దాకా.. అలాగే 2015 నుంచి 2016 దాకా తమిళనాడుకు ముఖ్యమంత్రికిగా సేవలందించారు. తెలుగు, తమిళం, కన్నడలో సుమారుగా 140కిపైగా చిత్రాలత్లో నటించారు. ఇక రజినీకాంత్ ప్రస్తుతం ‘జైలర్’చిత్రంలో నటిస్తున్నారు. మిల్క్ బ్యూటీ తమన్నా రజినీకాంత్ సరసన ఆడిపాడుతోంది. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 10: నేను వాడిని కచ్చితంగా కెలుకుతా, పవర్ తో వర్షిణిని బాత్రూమ్ లో ఇరికించిన షాలిని
Ranabaali Teaser Review: బ్రిటిష్ పై భీకర తిరుగుబాటు..మీసం తిప్పిన సింగనమల బొబ్బిలి రణబాలి