ఆగస్ట్‌ 2న మహేష్‌ 'స్పైడర్‌' ఫస్ట్‌ సాంగ్‌ రిలీజ్‌

Published : Jul 31, 2017, 08:54 PM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
ఆగస్ట్‌ 2న మహేష్‌ 'స్పైడర్‌' ఫస్ట్‌ సాంగ్‌ రిలీజ్‌

సారాంశం

సూపర్ స్టార్ మహేష్ ఆడియో రిలీజ్ తేదీ ఖరారు ఆగస్టు 2న స్పైడర్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ ఆగస్ట్‌ 9న సూపర్‌స్టార్‌ మహేష్‌ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్‌ టీజర్‌

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా ఠాగూర్‌ మధు సమర్పణలో ఎన్‌.వి.ఆర్‌. సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై ఎ.ఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో ఎన్‌.వి.ప్రసాద్‌ నిర్మిస్తున్న డిఫరెంట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'స్పైడర్‌'. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. కాగా, ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌ సాంగ్‌ 'బూమ్‌ బూమ్‌' ఆగస్ట్‌ 2న విడుదల చేస్తున్నారు. ఆగస్ట్‌ 9న సూపర్‌స్టార్‌ మహేష్‌ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్‌ టీజర్‌ను రిలీజ్‌ చేస్తారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి దసరా కానుకగా ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. 

సూపర్‌స్టార్‌ మహేష్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, ఎస్‌.జె.సూర్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హేరిస్‌ జయరాజ్‌, సినిమాటోగ్రఫీ: సంతోష్‌ శివన్‌ ఎఎస్‌సి.ఐఎస్‌సి, ఎడిటింగ్‌: శ్రీకర్‌ప్రసాద్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: రూపిన్‌ సుచక్‌, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్‌, సమర్పణ: ఠాగూర్‌ మధు, నిర్మాత: ఎన్‌.వి.ప్రసాద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.ఆర్‌.మురుగదాస్‌. 

PREV
click me!

Recommended Stories

Youtuber Nandu: నందూస్ వరల్డ్ రామనందన అరెస్ట్, దోషిగా తేలితే నందుకి పడే శిక్ష ఏంటో తెలుసా?
Romanchakam Day 5 Collections: సోమవారం పడిపోయిన రోమాంచకం.. 5 రోజుల్లో ఇంత కలెక్షన్లు ఊహించలేం