నాలుగు పదుల వయస్సు దాటినా ఇంకా కుర్రాడిలానే కనిపిస్తున్నారు సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu). జిమ్ లో హెవీ వర్కౌట్స్ చేస్తూ మరింత ఫిట్ గా మారిపోతున్నారు.
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే అందమైన హీరోల్లో సూపర్ స్టార్ మహేశ్ బాబు పేరు మొదటి వరుసలో ఉంటుంది. ఆయన హ్యాండ్ సమ్ లుక్ కు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. ఒకప్పుడు మిల్క్ బాయ్ గా క్రేజ్ పెంచుకున్న మహేశ్ బాబు ప్రస్తుతం షాకింగ్ లుక్ లో మైండ్ బ్లాక్ చేస్తున్నారు. తన తదుపరి చిత్రాల కోసం ఉక్కులాంటి శరీరాన్ని తయారు చేస్తున్నారు. ఇందుకోసం జిమ్ లో హెవీ వర్కౌట్స్ చేస్తూ బాడీని బిల్డ్ చేస్తున్నారు. గతేడాది నుంచే జిమ్ లో కసరత్తులు ప్రారంభించిన మహేశ్ బాబు లేటెస్ట్ లుక్ షాకింగ్ ఉంది. బలమైన కండరాలు, బైషేప్స్, భారీ చెస్ట్ తో షాక్ కు గురిచేస్తున్నారు.
తాజాగా జిమ్ లో తన వర్కౌట్ కు సంబంధించిన ఓ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు మహేశ్ బాబు. ఆ ఫొటోకు ‘ఆర్మ్ డే’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ సందర్భంగా కండరపుష్టిని చూపిస్తూ ఆకట్టుకుంటున్నారు. బీస్ట్ మోడ్ లో మహేశ్ బాబు దర్శనమివ్వడంతో ఫ్యాన్స్ నెట్టింట గోలగోల చేస్తున్నారు. తమ అభిమాన హీరో శ్రమించే తీరుకు పొంగిపోతున్నారు. ‘హాలీవుడ్ హీరో లోడింగ్’ అంటూ, ‘బాక్సీఫీస్ షేకే’ అంటూ కామెంట్లు సైతం పెడుతున్నారు.
అయితే, మహేశ్ బాబు ఎప్పటి నుంచో శరీరాన్ని తన అదుపులో ఉంచుకుంటారు. ఆహార నియమాలు, వ్యాయమం వంటివి ఆయన దినచర్యలో భాగంగా ఉంటాయి. అందుకే మహేశ్ బాబుకు 47 ఏండ్లు వచ్చిన ఇంకా యంగ్ లుక్ లోనే కనిపిస్తున్నారు. సూపర్ స్టార్ ను ఇలా చూసి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా, మునుపెన్నడూ లేనంతగా ఈ జిమ్ లో శ్రమిస్తుండటంతో నెక్ట్స్ సినిమాలు బాక్సీఫీస్ ను షేక్ చేస్తాయని అంటున్నారు. ఫిజియోథెరపిస్ట్ మరియు జిమ్ ట్రెయినర్ స్టీవెన్ ఆధ్వర్యంలో మహేశ్ హెవీ వర్కౌట్ చేస్తున్నారు.
స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఎస్ఎస్ఎంబీ28’లో నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ హైదరాబాద్ లోనే కొనసాగుతోంది. మూడో షెడ్యూల్ లో పూర్తి తారాగణం పాల్గొంటుందని తెలుస్తోంది. పూజా హెగ్దే, శ్రీలీలా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆ తర్వాత మహేశ్ బాబు దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో అడ్వెంచర్ ఫిల్మ్ లో నటించబోతున్నారు.