సూపర్ స్టార్ కృష్ణ (Superstar Krishna) నటించిన ఇండియాస్ ఫస్ట్ కౌబాయ్ ఫిల్మ్ ‘మోసగాళ్లకు మోసగాడు’ రీరిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇందుకు సంబంధించిన వివరాలను తాజాగా వెల్లడించారు.
చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసుకున్న దివంగత, సూపర్ స్టార్ కృష్ణ గురించి, ఆయన చేసిన ప్రయోగాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తన్ మార్క్ క్రియేట్ చేశారు. 360 చిత్రాల్లో నటించిన ఆయన నిర్మాతల హీరోగా, రికార్డుల గనిగా, చక్కని రూపసిగా తెలుగు గడ్డపై చెరగని ముద్ర వేసుకున్నారు. చిత్రసీమలో సాంకేతిక పరంగా ఎన్నో ప్రయోగాత్మ సినిమాలు చేశారు. అందులో ఎప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయే చిత్రం ‘మోసగాళ్లకు మోసగాడు’. ప్రస్తుతం ఈ చిత్రం రీరిలీజ్ కు సిద్ధమైంది.
ఇండియాస్ ఫస్ట్ కౌబాయ్ ఫిల్మ్ గా వచ్చిన Mosagallaku Mosagadu అప్పట్లో సంచలనంగా మారింది. పద్మాలయా స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై రూపొందించారు. ప్రముఖ నిర్మాత ఆది శేషగిరి రావు నిర్మించారు. కేఎస్ఆర్ దాస్ దర్శకత్వం వహించారు. కృష్ణ, విజయనిర్మల నటించిన ఈ చిత్రం 1971లో విడుదలైంది. మళ్లీ 52 ఏండ్ల తర్వాత థియేటర్లలోకి రాబోతోంది. ప్రస్తుతం రీరిలీజ్ ల ట్రెండ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ‘మోసగాళ్లకు మోసగాడు’ కూడా రాబోతోంది.
undefined
మే31న సూపర్ స్టార్ కృష్ణ 80వ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. ఇందుకోసం ఇప్పటికే 4కే ప్రింట్ ను కూడా రెడీ చేసినట్టు మేకర్స్ తెలిపారు. దీంతో కృష్ణ అభిమానులు, తెలుగు ప్రేక్షకులు ఖుషీ అవుతున్నారు. తాజాగా విడుదలైన పోస్టర్లు కూడా ఇప్పటి ఆడియెన్స్ ను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక కృష్ణ గతేడాది నవంబర్ 15న తుదిశ్వాస విడిచారు.
కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) - త్రివిక్రమ్ కాంబోలోని SSMB28 నుంచి కూడా సర్ ప్రైజ్ అందబోతుందని తెలుస్తోంది. ఇప్పటికే అప్డేట్ల విషయంలో నిర్మాత నాగవంశీ ఏమాత్రం తగ్గడం లేదు. దీంతో ఎలాంటి అప్డేట్ ఇవ్వబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. చిత్రంలో పూజా హెగ్దే, శ్రీలీలా హీరోయిన్లుగా నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటోంది. థమన్ సంగీతం అందిస్తున్నారు.
On the Occasion of Garu's Birth Anniversary, India's First Cow Boy Film Set to RELOAD in theatres worldwide on MAY 31st ❤️🔥
The movie that put Telugu cinema on the global map Re-Releasing in 4K 🌍 pic.twitter.com/eDKaStl861