ఇలియానా పాటకు శంకర్ కూతురు అదిరిపోయే డాన్స్.. అదితి స్టెప్పులకు వైరల్ అవుతున్న వీడియో

By Asianet News  |  First Published May 1, 2023, 5:38 PM IST

తమిళ సార్ట్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ (Aditi Shankar) తన డాన్స్ తో అదరగొట్టింది.  గోవా బ్యూటీ ఇలియానా పాటకు అదిరిపోయే స్టెప్పులేసింది. ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
 


తమిళ సార్ట్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ టాలెంటెడ్ అన్నది తెలిసిన విషయమే. మెడిసిన్ చదివిన ఈ స్టార్ కిడ్ శ్రీరామచంద్ర యూనివర్సిటీ నుంచి పట్టాను కూడా పొందింది. తన చదువు పూర్తైన తర్వాత సినీ ఇండస్ట్రీలోకి కూడా అడుగు పెట్టింది. డైరెక్టర్ ముత్తయ్య ఫిల్మ్ ‘విరుమన్’తో హీరోయిన్ గానూ ఎంట్రీ ఇచ్చింది. గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిందీ చిత్రం.  కార్తీ సరసన నటించి ఆకట్టుకుంది. 

అదితి శంకర్ ఎప్పుడూ సోషల్ మీడియా యాక్టివ్ గానే కనిపిస్తుంటుంది. ట్రెండీ రీల్స్, ఫొటోషూట్లతో ఆకట్టుకుంటుంది. నటిగా మంచి గుర్తింపు పొందేందుకు ప్రయత్నిస్తోంది.  ఈక్రమంలో బ్యాక్ టు బ్యాక్ పోస్టులు పెడుతూ వస్తోంది. ఈ క్రమంలో తాజాగా అదితి శంకర్ పంచుకున్న ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. హీరోయిన్ గా, సింగర్ ఆమో టాలెంట్ చూపించిన విషయం తెలిసిందే.  తాజాగా అద్భుతమైన డాన్స్ తోనూ ఆకట్టుకుంటోంది.

Latest Videos

గోవా బ్యూటీ ఇలియానా, విజయ్ దళపతి జంటగా నటించిన ‘స్నేహితుడు’ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహించారు.  తమిళంతో పాటు తెలుగులోనూ మంచి సక్సెస్ ను అందుకుంది. ఈ చిత్రంలోని పాటు కూడా అలరించాయి. ముఖ్యంగా ఇలియానా సన్నని నడుముతో ‘ఇలియానా.. చిట్టి బెల్లీయానా’ పాట ఇప్పటికీ అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే తాజాగా  అదే పాటకు అదితి శంకర్ అదిరిపోయే స్టెప్పులేశారు. 

తాజా ఫొటోషూట్ సందర్భంగా ఆ సాంగ్ కు డాన్స్ చేసి ఆకట్టుకుంది. బ్లాక్ లెహంగా, మ్యాచింగ్ బ్లౌజ్ లో బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకున్న అదితి తన డాన్స్ తోనూ అదరగొట్టింది. అదితి డాన్స్ కు అభిమానులు, నెటిజన్లు ఫిదా అవుతున్నారు. లైక్స్, కామెంట్లు పెడుతున్నారు. దీంతో  ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. 

గతంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ‘గని’ చిత్రంలో ‘రొమియో జులియెట్’కు గాత్రం కూడా అందించింది. తన చిత్రం ‘విరుమన్’లోనూ ఓ పాట పాడి సింగర్ గా ఆకట్టుకుంది. ‘వనక్కం చెన్నై చెస్’ మ్యూజిక్ వీడియోనూ నటించింది.  ప్రస్తుతం మరిన్నిన చిత్రాలకు అలరించేందుకు సిద్ధం అవుతోంది. ఈక్రమంలో శివకార్తీకేయన్ సరసన ‘మావీరన్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆగస్టు 11న ఈ చిత్రం రిలీజ్ కానుంది. 

 

 

click me!