సూపర్ స్టార్ సక్సెస్ ఫార్ములా.. రెమ్యునరేషన్ తీసుకోడట!

By Prashanth MFirst Published Oct 30, 2018, 4:48 PM IST
Highlights

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెప్పుకోదగిన అతి కొద్దీ స్టార్ హీరోలలో అమిర్ ఖాన్ ఒకరు. ఆయన సినిమా ఎనౌన్స్ చేశారంటే చాలు. తప్పకుండా అందులో ఎదో ఒక కొత్త ధనం ఉండే ఉంటుందని చెప్పవచ్చు. 

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెప్పుకోదగిన అతి కొద్దీ స్టార్ హీరోలలో అమిర్ ఖాన్ ఒకరు. ఆయన సినిమా ఎనౌన్స్ చేశారంటే చాలు. తప్పకుండా అందులో ఎదో ఒక కొత్త ధనం ఉండే ఉంటుందని చెప్పవచ్చు. హీరోగానే కాకుండా దర్శకుడిగా నిర్మాతగాను సక్సెస్ అందుకున్నాడు. లగాన్ - రంగ్ దే బసంతి - పీకే - దంగల్ చెప్పుకుంటూ పోతే ప్రతి అడుగులో ఎదో ఒక ప్రయోగం. 

ఇక ఈ దీపావళికి హిస్టారికల్ మూవీ థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ అనే సినిమాతో రానున్నాడు. మొదటి సారి అమిర్ ఖాన్ ఈ సినిమా ద్వారా అమితాబ్ బచ్చన్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అసలు మ్యాటర్ లోకి వస్తే రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిర్ ఖాన్ తన సక్సెస్ కెరీర్ గురించి కొన్ని విషయాలు చెప్పాడు. 

నిత్యం ప్రయోగాలు చేయడంలో భయం లేదు. అసలు ఓటమంటే భయపడను. ఒక నిర్మాతగా దర్శకుడిగా నేను ఎంచుకున్న కథను ఆడియెన్స్ ఒప్పుకున్నారంటే.. నా కళ విషయంలో ఎదో ఒక కొత్త విజయాన్ని సాధించాను అనే భావన కలుగుతోందని అమిర్ చెప్పారు.  

అలాగే అమిర్ ఖాన్ తన తండ్రి చెప్పిన రెండు విషయాలను కెరీర్ లో ఎప్పటికి మరచిపోలేడట. ఒక కథను సింగిల్ లైన్ లో ఎలా చెప్పగలవు? కథకు ఆధారమైన విషయం ఏమిటి? ఈ రెండు ప్రశ్నల గురించి అమిర్ తండ్రి తాహిర్ హుస్సేన్ నిత్యం చెబుతుండేవారట. ఆ ప్రశ్నలను ప్రతి సినిమా కథ విషయంలో గుర్తుచేసుకుంటాడట.

ఇక అమిర్ తన రెమ్యునరేషన్ గురించి మాట్లాడుతూ.. ఒక హీరోగా నా బాధ్యత సినిమాకు పెట్టిన బడ్జెట్ ను రికవర్ చేయడం. అందరికి రెమ్యునరేషన్ అందాలి. నేను సినిమా ఎండ్ అయ్యే వరకు ఒక్క రూపాయి కూడా తీసుకొను. రిలీజ్ తరువాత షేర్స్ లో లాభాలు వస్తే అప్పుడు తీసుకుంటాను అని అమిర్ ఖాన్ వివరించాడు. 

అంటే ఈ హీరో ఒక సినిమాను ఎంత బాధ్యతగా చూసుకుంటాడో చెప్పవచ్చు. ప్రయోగాలు చేయడంలో ముందుండే అమిర్ ఇలా తన కెరీర్ ను కొన్ని మంచి పద్ధతుల్లో తీసుకువెళుతున్నాడు. అందుకే ఆయనను సూపర్ స్టార్ అనేది అని నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. 

click me!