వైఎస్‌ జగన్‌ ని ఉద్దేశించి మహేష్ ట్వీట్స్!

Published : May 24, 2019, 04:12 PM IST
వైఎస్‌ జగన్‌ ని ఉద్దేశించి మహేష్ ట్వీట్స్!

సారాంశం

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం దిశగా దూసుకెళ్లిన  వైకాపా అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌కు సినిమా వాళ్లంతా అభినందనలు తెలియచేస్తున్నారు. 

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం దిశగా దూసుకెళ్లిన  వైకాపా అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌కు సినిమా వాళ్లంతా అభినందనలు తెలియచేస్తున్నారు. తాజాగా   సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు ట్విటర్‌ లో  అభినందనలు తెలిపారు. జగన్‌ పాలనలో రాష్ట్రం అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.  అంతేకాకుండా ప్రధాని మోడీ సైతం ఆయన అభినందనలు తెలియచేసారు.

‘ఆంధ్రప్రదేశ్‌లో అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న వైఎస్‌ జగన్‌కు అభినందనలు. మీ పాలనలో రాష్ట్రం అత్యున్నత శిఖరాలు అందుకోవాలని, అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని మనసార ఆకాంక్షిస్తున్నాను’ అని మహేశ్‌బాబు ట్వీట్‌ చేశారు. 

ఇక గురువారం వెలువడిన ఏపీ ఎన్నికల ఫలితాల్లో వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ 151 అసెంబ్లీ సీట్లు, 22 ఎంపీ సీట్లతో ప్రభంజనం సృష్టించింది.

 

PREV
click me!

Recommended Stories

Anasuya: జబర్దస్త్ లో జరిగినదానికి నాకు సంబంధం లేదు అంటూ అనసూయ ట్విస్ట్.. హద్దులు దాటిన మాట వాస్తవమే కానీ
Chiru Vs Anil: 2027 సంక్రాంతికి చిరంజీవి వర్సెస్ అనిల్ రావిపూడి.. లిస్ట్ లో 6 సినిమాలు, మజా గ్యారెంటీ