ఆర్నాల్డ్ అదరకొట్టాడు: ‘టెర్మినేటర్‌: డార్క్‌ ఫేట్’ ట్రైలర్

By AN TeluguFirst Published May 24, 2019, 4:04 PM IST
Highlights

ప్రపంచ వ్యాప్తంగా సూపర్ హిట్టైన  చిత్రాల్లో ‘టెర్మినేటర్‌’ సిరీస్‌ ఒకటి. టెర్మినేటర్‌గా ఆర్నాల్డ్‌ స్క్వాజ్‌నెగ్గర్‌ నటన, ఆయన చేసిన యాక్షన్‌  సీన్స్  ప్రేక్షకులను కట్టిపారేసాయి. 

ప్రపంచ వ్యాప్తంగా సూపర్ హిట్టైన  చిత్రాల్లో ‘టెర్మినేటర్‌’ సిరీస్‌ ఒకటి. టెర్మినేటర్‌గా ఆర్నాల్డ్‌ స్క్వాజ్‌నెగ్గర్‌ నటన, ఆయన చేసిన యాక్షన్‌  సీన్స్  ప్రేక్షకులను కట్టిపారేసాయి. ఇప్పుడు ఈ సిరీస్‌లో ఆరో చిత్రం ‘టెర్మినేటర్‌: డార్క్‌ఫేట్‌’ రాబోతోంది. ఈ ఏడాది నవంబరు 1న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.  ఈ నేఫధ్యంలో ఈ చిత్రం ట్రైలర్ ని విడుదల చేసారు.

టెర్మినేటర్‌ను పోలి ఉన్న రెవ్‌-9 (గేబ్రియల్‌ లూనా) డ్యానీ (నటాలియా రెయేస్‌)ను చంపాలని యత్నిస్తుంటాడు. డ్యానీని కాపాడేందుకు సారా కోన్నర్‌ (లిండా హ్యామిల్టన్‌), అసలైన టెర్మినేటర్‌ (ఆర్నాల్డ్‌ ష్వార్జ్‌నెగ్గర్‌)తో కలిసి సాయశక్తులా ప్రయత్నిస్తుంది. రెవ్‌-9 నుంచి సారా.. డ్యానీని ఎలా కాపాడింది? అన్నదే ఈ సినిమా కథ. 

71 ఏళ్ల వయసులో ఇప్పుడు మరోసారి ఆర్నాల్డ్‌ స్క్వార్జ్‌నెగర్‌ టెర్మినేటర్‌గా కనిపించబోతుండటం విశేషం.    ‘డెడ్‌పూల్‌’ దర్శకుడు టిమ్‌ మిల్లర్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ దర్శక నిర్మాత జేమ్స్‌ కేమరూన్‌ నిర్మిస్తున్నారు. 1991లో వచ్చిన ‘టెర్మినేటర్‌ 2: జడ్జిమెంట్‌ డే’కు డైరెక్ట్‌ సీక్వెల్‌గా ఇది రూపొందుతోంది.  

ఈ చిత్రంలో ఆర్నాల్డ్‌తో పాటు లిండా హామిల్టన్‌, డేవిస్‌, గాబ్రియల్‌ లునా, నటాలియా రేఐస్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.  పారామౌంట్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై జేమ్స్ కెమరూన్‌, డేవిడ్‌ ఎల్లిసన్‌ సంయుక్తంగా నిర్మింస్తున్నారు. నవంబర్‌ 1న సినిమాను ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 

 

click me!
Last Updated May 24, 2019, 4:04 PM IST
click me!