వస్తున్నా, యుద్ధంలో దిగాక గెలిచి తీరాలి-రజినీ కాంత్

First Published Dec 26, 2017, 10:15 AM IST
Highlights
  • అభిమానులతో భేటీలో రాజకీయ పార్టీపై చర్చిస్తున్న రజినీ
  • 31 డిసెంబరు కల్లా కీలక ప్రకటన చేసేందుకు సన్నద్ధం
  • రాజకీయాలు  తనకు కొత్తకాదని, యుద్ధంలో దిగితే గెలిచి తీరాలని పిలుపు

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ ప్రవేశంపై గత కొంత కాలంగా విస్తృతంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్థుతం రజినీ ఫ్యాన్స్ తో భేటీ అవుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా తన రాజకీయ రంగప్రవేశంపై ఈ నెల 31వ తేదీన ప్రకటన చేస్తానని సూపర్ స్టార్ రజనీకాంత్ చెప్పారు.

 

ఏడు నెలల తర్వాత ఈయేడాది రెండోసారి అభిమానులతో భేటీ అయిన రజినీ మంగళవారంనాడు కోడంబాక్కంలోని రాఘవేంద్ర కల్యాణ మండపంలో తన అభిమానులను కలుసుకున్నారు. తన అభిమానులను మళ్లీ కలుసుకోవడం ఆనందంగా ఉందని ఆయన చెప్పారు. తాను హీరో కావాలని సినిమాల్లోకి రాలేదని ఆయన చెప్పారు. హీరోగా తన తొలి సంపాదన 50 వేల రూపాయలని ఆయన చెప్పారు. తాను రాజకీయాల్లోకి రావడమంటే విజయం సాధించినట్లేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రజనీకాంత్ ఆరు రోజుల పాటు తన అభిమానులతో సమావేశమవుతారు. మంగళవారంనాడు కాంచీపురం, తిరువళ్లూరు, తదితర ప్రాంతాలకు చెందిన అభిమానులను కలుసుకున్నారు.

 

రాజకీయాలు తనకు కొత్త కాదని, ఇప్పటికే రాజకీయాల్లోకి రావడం ఆలస్యం చేశానని ఆయన అన్నారు. తాను 1996 నుంచి రాజకీయాలను చూస్తున్నానని ఆయన చెప్పారు. యుద్ధంలోకి దిగితే గెలిచి తీరాలని ఆయన అన్నారు. మీడియా ఎక్కువ ఆసక్తి చూపుతోందని, సూపర్ స్టార్ కావాలని సినిమాల్లోకి రాలేదని ఆయన చెప్పారు.

click me!