హాట్ సమ్మర్ లో మహేష్ 'సర్కారు వారి పాట'..కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్

pratap reddy   | Asianet News
Published : Nov 03, 2021, 04:57 PM ISTUpdated : Nov 03, 2021, 05:56 PM IST
హాట్ సమ్మర్ లో మహేష్ 'సర్కారు వారి పాట'..కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్

సారాంశం

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'సర్కారు వారి పాట'. గీత గోవిందం ఫేమ్ పరశురామ్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ మూవీపై ఆకాశాన్ని తాకే అంచనాలు ఉన్నాయి. 

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'సర్కారు వారి పాట'. గీత గోవిందం ఫేమ్ పరశురామ్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ మూవీపై ఆకాశాన్ని తాకే అంచనాలు ఉన్నాయి. మహేష్ బాబుకి జోడిగా ఈ మూవీలో కీర్తి సురేష్ నటిస్తోంది. ఆ మధ్యన సర్కారు వారి పాట చిత్రం నుంచి ఫస్ట్ నోటిస్ అంటూ టీజర్ విడుదలయింది. ఈ టీజర్ లో మహేష్ లుక్, యాక్టిట్యూడ్ అభిమానులని విపరీతంగా ఆకట్టుకున్నాయి. 

చాలా కాలం తర్వాత Mahesh Babu చిత్రానికి పోకిరి తరహా వైబ్స్ వస్తున్నాయనే కామెంట్స్ వినిపించాయి. సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేయాలని ముందుగా నిర్ణయించారు. కానీ సంక్రాంతి ఫైట్ బాగా టైట్ గా మారింది. పవన్ కళ్యాణ్ Bheemla Nayak, ప్రభాస్ రాధే శ్యామ్ చిత్రాలు సంక్రాంతి బరిలో ఉన్నాయి. దీనికి తోడు రాజమౌళి భారీ చిత్రం RRR ఎంటర్ కావడంతో సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. 

దీనితో పోటీ వల్ల అనవసర డ్యామేజ్ ఎందుకని భావించారో ఏమో కానీ.. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న మైత్రి సంస్థ కొత్త రిలీజ్ డేట్ ప్రకటించింది. సమ్మర్ వేడిలో మహేష్ Sarkaru VaariPaata చిత్రం ఏప్రిల్ 1న రిలీజ్ కానున్నట్లు ప్రకటించారు. దీనితో ప్రపంచ వ్యాప్తంగా మహేష్ బాబు ఆక్షన్ అండ్ యాక్షన్ ఏప్రిల్ 1 నుంచి షురూ కానున్నట్లు మేకర్స్ తెలిపారు. 

Also Read: అనసూయ బెల్లీ షో, మరీ ఇంత హాటా.. నడుము అందాలతో రెచ్చిపోయిన హాట్ యాంకర్

చాలా కాలం తర్వాత మహేష్ బాబు కొత్త మేకోవర్ లో కనిపించబోతున్న చిత్రం ఇది. దీనితో దర్శకుడు పరుశురాం ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నాడు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. 

రాధే శ్యామ్, ఆర్ఆర్ఆర్ రెండు చిత్రాలు పాన్ ఇండియా మూవీస్. ఈ రెండు చిత్రాల నడుమ ఇంకే చిత్రం విడుదలైనా వసూళ్లపై ప్రభావం ఉంటుందనే అభిప్రాయం ట్రేడ్ లో ఉంది. కానీ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ మాత్రం సంక్రాంతి బరి నుంచి తప్పుకోవడం లేదు. జనవరి 12న ఈ చిత్రం విడుదల కానుంది. 

 

PREV
click me!

Recommended Stories

Akhanda 2 Review: 'అఖండ 2' మూవీ రివ్యూ, రేటింగ్.. బాలకృష్ణ తాండవం ఎలా ఉందో తెలుసా ?
సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే