సూపర్ స్టార్ మహేష్ బాబు స్టైడర్ శాటిలైట్ రైట్స్ అన్ని కోట్లా

Published : Apr 13, 2017, 08:42 AM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
సూపర్ స్టార్ మహేష్ బాబు స్టైడర్ శాటిలైట్ రైట్స్ అన్ని కోట్లా

సారాంశం

సూపర్ స్టార్ మహేష్ , తమిళ స్టార్ దర్శకుడు మురుగదదాస్ కాంబినేషన్ లో స్పైడర్ ప్రస్ఠుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం జూన్ 23న విడుదల ఇప్పటికే శాటిలైట్ రైట్స్ కోసం పోటీపడి  26 కోట్లకు దక్కించుకున్న ఛానెల్  

సూపర్ స్టార్ మహేష్ బాబు, తమిళ స్టార్ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్ లో వస్తోన్న చిత్రం స్పైడర్. గత కొన్ని నెలలుగా ఊరించి ఊరించి.. చివరకు మహేష్ అభిమానులతో సోషల్ మీడియాలో విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు దర్శకుడు మురుగదాస్. చివరకు నిన్న రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ తో మహేష్ బాబు అభిమానులనే కాక సినీ ప్రేక్షకులందర్నీ ఆకట్టుకున్నాడు మురుగదాస్. మహేష్ బాబు సరికొత్త స్టైలిష్ లుక్ తో స్పైడర్ సినిమా రేంజ్ ఏంటో తెలిసేలా చేశాడు దర్శకుడు.

 

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మురుగదాస్ దర్వకత్వంలో తెరకెక్కుతున్న స్పైడర్ సినిమా ఇప్పటికే 80 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా క్లైమాక్స్, రెండు పాటలు మినహా షూటింగ్ అంతా పూర్తయ్యింది. దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా మహేష్, మురుగదాస్ ల కాంబినేషన్ పై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఇదే క్రేజ్ ను క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు మూవీ మేకర్స్.


ఇంకా షూటింగ్ కూడా పూర్తి కాకుండా బిజినెస్ స్టార్ట్ చేసేసింది  స్పైడర్. ఇప్పటి వరకు ఉన్న అంచనాల ప్రకారం ఈ సినిమా రిలీజ్ కు ముందే 150 కోట్ల వరకు బిజినెస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా మరో ఇంట్రస్టింగ్ వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. స్పైడర్ శాటిలైట్ రైట్స్ ను ఓ ఛానల్ భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ రైట్స్ కలిపి 36 కోట్లు శాటిలైట్ రైట్స్ కోసం చెల్లించారట. ఇలా షూటింగ్ పూర్తి కాకుండానే క్రేజీ బిజినెస్ చేస్తున్నాడు స్పైడర్.

PREV
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు