Ramesh Babu Death: మీరే నా బలం, ధైర్యం అన్నయ్యా.. మహేష్ ఎమోషనల్

Published : Jan 09, 2022, 03:16 PM IST
Ramesh Babu Death: మీరే నా బలం, ధైర్యం అన్నయ్యా.. మహేష్ ఎమోషనల్

సారాంశం

అన్నయ్య రమేష్ బాబు అకాలమరణంపై మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. రమేష్ బాబు మృతిపై దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. కరోనా సోకడంతో క్వారంటైన్ లో ఉన్న మహేష్ తన సోషల్ మీడియా సందేశం ద్వారా నివాళులు అర్పించారు. 


కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న రమేష్ బాబు (Ramesh Babu)శనివారం రాత్రి అకాలమరణం పొందారు. 56 ఏళ్ల రమేష్ బాబు లివరు సంబంధింత వ్యాధితో మరణించినట్లు సమాచారం. సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడిగా చిన్న ప్రాయంలోనే వెండితెరకు పరిచయమయ్యారు. బాలనటుడిగా, హీరోగా పలు చిత్రాలలో రాణించారు. అయితే ఆయన కెరీర్ సవ్యంగా సాగకపోవడంతో నటుడిగా తక్కువ సినిమాకే రిటైర్ అయ్యారు. అనంతరం నిర్మాతగా పలు చిత్రాలు నిర్మించారు. 

ఇక రమేష్ బాబు మరణవార్త తెలుసుకున్న చిత్ర ప్రముఖులు, రాజకీయవేత్తలు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. రమేష్ బాబు మృతికి సంతాపం ప్రకటిస్తున్నారు. ఇక అన్నయ్య రమేష్ మరణం మహేష్ బాబును తీవ్రంగా కలచివేసింది. చివరికు రమేష్ బాబు అంత్యక్రియలకు కూడా మహేష్ బాబు హాజరుకాలేని పరిస్థితి నెలకొని ఉంది. దీనితో ట్విట్టర్ వేదికగా మహేష్ తన ఆవేదన, అన్నయ్యతో ఉన్న అనుభంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. 

మహేష్ (Mahesh Babu)తన సందేశంలో... ''మీరు నా స్ఫూర్తి, ధైర్యం, శక్తి, నా ప్రపంచం. మీరు లేకుంటే నేను ఇలా పరిపూర్ణమైన వ్యక్తిని అయ్యేవాడిని కాను. నాకు మీరు చేసిన దానికి కృతజ్ఞుడను. ఈ జన్మకే కాదు మరు జన్మంటూ ఉంటే.. అప్పుడు కూడా మీరు నా అన్నగా ఉండాలని కోరుకుంటున్నాను. లవ్ యూ ఫర్ ఎవర్... రెస్ట్ ఇన్ పీస్'' అంటూ మహేష్ తన ఆవేదన వెల్లడించారు.

మహేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు రమేష్ బాబు హీరోగా సినిమాలు చేస్తున్నారు. అన్నయ్య రమేష్ బాబుతో కూడా మహేష్ సినిమాలు చేయడం విశేషం. కృష్ణ (Krishna)దర్శకత్వంలో తెరకెక్కిన ముగ్గురు కొడుకులు చిత్రంలో తండ్రి కృష్ణకు తమ్ముళ్లుగా రమేష్ బాబు, మహేష్ బాబు నటించడం విశేషం. రమేష్ బాబుతో మహేష్ కి అరుదైన జ్ఞాపకాలు, అనుబంధం ఉంది. అందుకే రమేష్ బాబు మరణాన్ని ఆయన జీర్ణించుకోలేకున్నారు. 

ఇటీవల దుబాయ్ వెళ్లిన మహేష్ బాబుకి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. వైద్యుల సలహా మేరకు మహేష్ ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. కరోనా కారణంగా తనకు అత్యంత ప్రియమైన అన్నయ్య రమేష్ బాబు చివరి చూపుకు నోచుకోలేకపోయారు. 

రమేష్ బాబు పార్థివ దేహాన్ని పద్మాలయ స్టూడియోస్ లో ఉంచారు. ప్రముఖులు నివాళులు అర్పించిన అనంతరం రమేష్ బాబు భౌతిక కాయాన్ని జూబ్లీ హిల్స్ లోని మహాప్రస్థానంకి తరలించారు. మహా ప్రస్థానంలో రమేష్ బాబు అంత్యక్రియలు జరిగాయి. సాంప్రదాయం ప్రకారం రమేష్ కుమారుడు జయకృష్ణ తన తండ్రి చితికి నిప్పంటించారు. కోవిడ్ నిబంధనల కారణంగా కొద్ది మంది మాత్రమే అంత్యక్రియల్లో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులు నరేష్, సుధీర్ బాబు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Balakrishna: బాలకృష్ణకి నచ్చిన జూ. ఎన్టీఆర్ 2 సినిమాలు ఏంటో తెలుసా ? అభిమానులకు పూనకాలు తెప్పించిన మాట అదే
Chiranjeevi : దాసరి స్థానం మెగాస్టార్ దే, ఇండస్ట్రీ పెద్ద ఎవరో తేల్చేసిన మా మాజీ అధ్యక్షుడు