సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కర్మ కోసం భారీగా ఏర్పాట్లు.. హాజరు కానున్న సినీ రాజకీయ ప్రముఖులు

By team teluguFirst Published Nov 27, 2022, 10:33 AM IST
Highlights

సూపర్ స్టార్ కృష్ణ మరణం చిత్ర పరిశ్రమలో తీరని లోటుగా మారింది. ఈ నెల 15న కృష్ణ అనారోగ్యం కారణంగా కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

సూపర్ స్టార్ కృష్ణ మరణం చిత్ర పరిశ్రమలో తీరని లోటుగా మారింది. ఈ నెల 15న కృష్ణ అనారోగ్యం కారణంగా కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. దీనితో కృష్ణ ఫ్యామిలీతో పాటు, చిత్ర పరిశ్రమ, అభిమానులు అంతా శోకసంద్రంలో మునిగిపోయారు. 

మహేష్ బాబు ప్రస్తుతం తన తండ్రికి జరగాల్సిన కార్యక్రమాలు చూసుకుంటున్నారు. నేడు 10వ రోజు సందర్భంగా పెద్ద కర్మ నిర్వహించబోతున్నారు. దీనికోసం భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. జెఆర్సీ కన్వెన్షన్ లో సినీ రాజకీయ ప్రముఖులకు.. అభిమానులకు ప్రత్యేకంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

దాదాపు 5 వేలమంది అభిమానులు హాజరయ్యేలా మహేష్ బాబు టీం పాసుల పంపిణి చేస్తున్నట్లు తెలుస్తోంది. వివిధ వంటకాలతో భోజన ఏర్పాట్లు జరుగుతున్నాయి. మహేష్ బాబుతో పాటు కుటుంబ సభ్యులు అంతా దగ్గరుండి ఏర్పాట్లు చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. 

అలాగే ఈ కార్యక్రమంలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాలని కూడా ప్రారంభించనున్నారు. టాలీవుడ్ లో ఎన్నో విప్లవాత్మక మార్పులకు సూపర్ స్టార్ కృష్ణ కారణం అయ్యారు. సాహసాలకు పెట్టింది పేరు ఆయన. బుర్రిపాలెం గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించిన కృష్ణ టాలీవుడ్ లో తిరుగులేని సూపర్ స్టార్ గా ఎదిగారు. కృష్ణ దాదాపు 340 పైగా చిత్రాల్లో నటించారు. 

click me!