రజనీకాంత్ తో సినిమా పై క్లారిటీ ఇచ్చిన బీస్ట్ డైరెక్టర్, మూవీ కాన్సిల్ అంటూ వచ్చిన రూమర్స్ పై స్పందన

Published : Apr 21, 2022, 12:24 PM IST
రజనీకాంత్ తో సినిమా పై క్లారిటీ ఇచ్చిన బీస్ట్ డైరెక్టర్, మూవీ కాన్సిల్ అంటూ వచ్చిన రూమర్స్ పై స్పందన

సారాంశం

 కోలీవుడ్ లో చాలా తక్కువ టైమ్ లో మంచి పేరు సాధించాడు యంగ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్. ఇక బీస్ట్ మూవీ రిలీజ్ తరువాత ఆయనపై ట్రోలింగ్ స్టార్ట్ అయ్యింద. ఇక రజనీ కాంత్ తో ముందుగా అనుకున్న సినిమాపై నీలి నీడలు కమ్ముకోగా.. రీసెంట్ గా వాటిపై క్లారిటీ ఇచ్చాడు స్టార్ డైరెక్టర్. 

 కోలీవుడ్ లో చాలా తక్కువ టైమ్ లో మంచి పేరు సాధించాడు యంగ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్. ఇక బీస్ట్ మూవీ రిలీజ్ తరువాత ఆయనపై ట్రోలింగ్ స్టార్ట్ అయ్యింద. ఇక రజనీ కాంత్ తో ముందుగా అనుకున్న సినిమాపై నీలి నీడలు కమ్ముకోగా.. రీసెంట్ గా వాటిపై క్లారిటీ ఇచ్చాడు స్టార్ డైరెక్టర్. 

విజయ్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ రూ పొందించిన బీస్ట్ భారీ అంచనాల మధ్య విడుదలైంది. అయితే ఆ అంచనాలను ఈ సినిమా అందుకోలేకపోయింది. డైరెక్టర్ నెల్సన్ దిలీప్  గతంలో చేసిన కొలమావు కోకిల, డాక్టర్  సినిమాల వల్ల బీస్ట్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈసినిమాలు చూస్తే స్క్రీన్ ప్లే పై ఆయనకున్న పట్టు తెలుస్తుంది. 

భారీ స్థాయిలో బిల్డప్ లతో రిలీజ్ అయిన బీస్ట్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. దీనికి తోడు కేజిఎఫ్ 2 ప్రభంజనం కూడా  కొనసాగుతుండడంతో బీస్ట్ కలెక్షన్స్ కి గండి పడుతోంది.. టెర్రరిజం.. హైజాక్ లాంటి అంశాలతో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ రా ఏజంట్ గా నటించాడు. ఈసినిమా ప్లాప్ తో తాజాగా  విజయ్ తండ్రి చంద్రశేఖర్ తీవ్ర విమర్శలు చేశారు. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ పై విరుచుకుపడ్డారు. అసలు ఇదేం సినిమా అంటూ ధ్వజమెత్తారు. ఓ ఇంటర్వ్యూలో చంద్ర శేఖర్ బీస్ట్ మూవీ గురించి కామెంట్స్ చేశారు.

 బీస్ట్ సినిమాలో హీరో శ్రమ, ఫైట్ మాస్టర్స్ ప్రతిభ, కొరియోగ్రఫీ మాత్రమే కనిపించాయి. కానీ ఎక్కడా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ప్రతిభ కనిపించలేదు. చాలా మంది కొత్త డైరెక్టర్లు వారి ఫస్ట్ రెండు సినిమాలు బాగానే చేస్తారు. మూడో సినిమాకు  స్టార్ హీరోల డేట్స్ దొరుకుతాయి. దీనితో గాల్లో తేలిపోతూ.. కనీసం హోమ్ వర్క్, సరైన స్క్రిప్ట్ లేకుండా సెట్స్ కి వచ్చేస్తారు. అంటూ మండి పడ్డారు. 

బీస్ట్ సినిమాకి వచ్చేసరికి  నెల్సన్ దిలీజ్ మార్క్ స్క్రీన్ ప్లే మిస్సయింది. సన్  పిక్చర్స్ వారు నిర్మించిన ఈ సినిమా, విజయ్ స్టైల్ తోనే చాలావరకూ నెట్టుకొచ్చింది. ఈ సినిమా విజయ్ స్థాయికి తూగకపోవడం వలన, ఆ తరువాత రజనీతో నెల్సన్ చేయవలసిన సినిమా క్యాన్సిల్ అయిందనే టాక్ బలంగా వినిపిపించింది. నెల్సన్ పని అయిపోయింది. రజనీతో సినిమా లేదు అంటూ ప్రచారం జరిగింది. ఇక దీనిపై క్లారిటీ ఇచ్చారు నెల్సన్ దిలీప్.

సన్ పిక్చర్స్ వారే నెల్సన్ దర్శకత్వంలో రజనీకాంత్ తో ఓ సినిమాను ఎనౌన్స్ చేశారు. అయితే బీస్ట్ ప్లాప్ అవ్వడంతో రజనీ ప్రాజెక్టును వారు ఆపేసినట్టుగా ప్రచారం జరుగుతోంది.  ఈ విషయం పై ఓ సందర్భంలో క్లారిటీ ఇచ్చారు దర్శకుడు నెల్సన్ దిలీప్. అదంతా పుకారు మాత్రమేననే విషయాన్ని స్పష్టం చేస్తూ.. రజనీతో తన సినిమా ఉందనే విషయాన్ని నెల్సన్ తెలియజేశాడు.

PREV
click me!

Recommended Stories

Rithu Remuneration బిగ్ బాస్ విన్నర్ రేంజ్ లో పారితోషికం, రీతూ చౌదరి ఎలిమినేషన్ కు కారణాలు ఇవే ?
30 ఏళ్ళు మేకప్ మ్యాన్ గా పని చేసిన వ్యక్తితో అనుష్క సినిమా, గోవాకి పిలిచి మరీ వార్నింగ్ ఇచ్చిన అగ్ర హీరో