బాడీలు పెంచితే సరిపోదు, నటన కూడా ఉండాలి... బాలీవుడ్ హీరోలపై సన్నీ డియోల్ సంచలన వ్యాఖ్యలు

Published : Aug 13, 2023, 01:38 PM IST
బాడీలు పెంచితే సరిపోదు, నటన కూడా ఉండాలి... బాలీవుడ్ హీరోలపై సన్నీ డియోల్ సంచలన వ్యాఖ్యలు

సారాంశం

కండలు తిరిగిన బాడీలు ఉంటే సరిపోతు.. హిట్ ఇవ్వగల నటన ఉండాలి, మంచి కథలు తీసుకోవాలి అంటూ.. బాలీవుడ్ హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రముఖ నటుడు సన్నీ డియోలు.. ఆయన ఇంకా ఏమన్నారంటే..? 

గత కొన్నేళ్లుగా బాలీవుడ్ సాలిడ్ హిట్ చూసింది లేదు. ఆమధ్య వచ్చిన షారుఖ్ ఖాన్ పఠాన్ మూవీ తప్పించి.. గట్టిగా సినిమా పడలేదు. పఠాన్ కలెక్షన్స్ పై కూడా బాలీవుడ్ స్టార్స్ లోనే రకరకాల అనుమానాలు కూడా ఉన్నాయి. ఈక్రమంలో బాలీవుడ్ హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రముఖ నటుడు సన్నీ డియోల్.  కొన్నేళ్ళుగా..  ఫ్లాప్స్ తో అల్లాడిపోతున్న బాలీవుడ్ కి ఇప్పుడిప్పుడే అడపాదడపా హిట్స్ వస్తున్నాయి. ఇలాంటి టైంలో నటీనటులు మంచి మంచి కథలని సెలెక్ట్ చేసుకొని ప్రేక్షకుల ముందుకి రావాలి అన్న అభిప్రాయం వెల్లడించారు. 

బాలీవుడ్ అంటే  లో సిక్స్ ప్యాక్, కండలు తిరిగిన బాడీలు చూపించడం, ముద్దు సీన్లు.. స్టార్ హీరోయిన్ల ఎక్స్ పోజింగ్ లు.. ఇలాంటివి అక్కడ  అలవాటే. ప్రతి హీరో తన సినిమాలో ఏదో ఒక సీన్  సిక్స్ ప్యాక్ బాడీని చూపనించాలని తపపనపడతుంటాడు. హీరోయిన్ కూడా తన స్కిన్ షోతో ఆకట్టుకోవాలి అని చూస్తుంటుంది. ఈరెండు ఎక్కువ అవ్వడం వలన.. సినిమాలో కథకు విలువ లేకుండా పోతుంది. యాక్టింగ్ కు స్కోప్ తగ్గిపోతుంది. తన బాడీని చూపించడానికి,  ఎక్స్ పోజింగ్ కు.. హీరో ఎలివేషన్ సీన్స్ కు టైమ్ తినేస్తుంటు సినిమా కథ ప్రాణం పోసుకోలేకపోతుంది అన్న అభిప్రాయం పెరిగిపోతుంది. 

తాజాగా ఈ విషయాన్ని బాలీవుడ్ హీరోలకు గుర్తు చేశారు.. ప్రముఖ  సీనియర్ హిందీ నటుడు సన్నీ డియోల్. ఇప్పటి బాలీవుడ్ హీరోలపై కామెంట్స్ చేశాడు. సన్నీ డియోల్ తాజాగా గదర్ 2 సినిమాతో వచ్చి మంచి సక్సెస్ ను అందుకున్నాడు. ఈ సినిమా సక్సెస్ ఇంటర్వ్యూలలో బిజీ బిజీగా గడిపేస్తున్న ఆయన.. తాజాగా ఈ విషయంపై స్పందించాడు. ఆయన మాట్లాడుతూ ఇప్పటి హీరోల కండలు తిరిగిన బాడీలపై దృష్టి పెటుతున్నారు కాని నటనపై మాత్రం ఫోకస్ చేయడం లేదు అన్నారు. 

సన్నీ డియోల్ మాట్లాడుతూ.. ఇప్పటి హీరోలు బాడీ బిల్డింగ్ కాదు నటనపై దృష్టి పెట్టాలి. మీరేమి బాడీ బిల్డర్స్ కాదు కండలు పెంచుకోవడానికి, మీరు యాక్టర్లు అన్న సంగతి మర్చిపోకండి... బాడీ ఫిట్ గా, ఆరోగ్యంగా ఉంటే చాలు. పాత సినిమాలు చూడండి ఎంత బాగా నటిస్తారో తెలుస్తుంది. కండలు ఉన్న వ్యక్తులకంటే బాగా నటిస్తారు అనే వ్యక్తులుగా గుర్తింపు తెచ్చుకోండి. కథలపై, నటనపై దృష్టి పెట్టండి అంటూ మాట్లాడారు. దీంతో సన్నీ డియోల్ చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.  సంచలనంగా మారిన సన్నీ డియోల్ కామెంట్స్ పై  ఇప్పటి వరకూ ఎవరూ స్పందించలేదు.. ఇక ముందు ఎవరైనా మాట్లాడుతారేమో చూడాలి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?
Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..