కమెడియన్ గా సునీల్ రెమ్యునరేషన్.. రోజుకి మూడున్నర లక్షలు!

Published : Aug 23, 2018, 12:19 PM ISTUpdated : Sep 09, 2018, 11:02 AM IST
కమెడియన్ గా సునీల్ రెమ్యునరేషన్.. రోజుకి మూడున్నర లక్షలు!

సారాంశం

టాలీవుడ్ లో కమెడియన్ గా కెరీర్ మొదలుపెట్టిన సునీల్ 'మర్యాద రామన్న' సినిమాతో హీరోగా మారాడు. ఇక కమెడియన్ పాత్రలకు స్వస్తి చెప్పి హీరోగా సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. అతి కష్టం మీద బరువు తగ్గించి సిక్స్ ప్యాక్ చేశాడు

టాలీవుడ్ లో కమెడియన్ గా కెరీర్ మొదలుపెట్టిన సునీల్ 'మర్యాద రామన్న' సినిమాతో హీరోగా మారాడు. ఇక కమెడియన్ పాత్రలకు స్వస్తి చెప్పి హీరోగా సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. అతి కష్టం మీద బరువు తగ్గించి సిక్స్ ప్యాక్ చేశాడు. కమర్షియల్ హీరోగా ఎదగాలని భావించాడు. కానీ హీరోగా సరైన బ్రేక్ మాత్రం దక్కలేదు. మధ్యలో ఒకట్రెండు సినిమాల్లో ఓకే అనిపించినా.. నిర్మాతలకు లాభాలు మాత్రం రాలేదు.

దీంతో అతడికి హీరోగా అవకాశాలు తగ్గాయి. ఇప్పుడు మళ్లీ కమెడియన్ గా బిజీ అవ్వాలని నిర్ణయించుకున్నాడు.  ఈ క్రమంలో సునీల్ ని వెతుక్కుంటూ చాలా అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అరవింద సమేత' సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. హీరోగా కోట్లలో రెమ్యునరేషన్ తీసుకునే సునీల్ మరి కమెడియన్ గా ఎంత తీసుకుంటున్నాడనే విషయం ఆరా తీయగా.. ఆయన రోజుల చొప్పున రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని తెలిసింది.

కాల్షీట్ల ప్రకారం రోజుకి రూ.3.5 లక్షల రూపాయలను ఛార్జ్ చేస్తున్నాడట. టాలీవుడ్ లో టాప్ కమెడియన్స్ కి చెల్లించే మొత్తమే సునీల్ కి కూడా ఇస్తున్నారన్నమాట. సునీల్ గనుక మరోసారి కమెడియన్ గా నిరూపించుకుంటే టాలీవుడ్ లో బిజీ కావడం ఖాయం. మరి వెన్నెల కిషోర్ వంటి నటులను సునీల్ పోటీగా మారతాడేమో చూడాలి!

PREV
click me!

Recommended Stories

Sivakarthikeyan: హీరోలు ఒకరి తర్వాత ఒకరు..దుబాయ్ మోజు వెనుక ఇదే కారణం!
Amla Paul: కొడుకుతో క్యూట్ ఫోటోలని షేర్ చేసిన అమలాపాల్.. నెటిజన్ల విమర్శలు