
ఈ ఏడాది ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్న సినిమాల్లో రజనీకాంత్ 'జైలర్' ఒకటి. ఈ సినిమా ప్యాన్ ఇండియా చిత్రంగా రిలీజ్ అవుతోంది. ఈ నేపధ్యంలో మళయాళంల నుంచి మోహన్ లాల్ ని తీసుకున్నారు. అలాగే ఈ చిత్రంలో కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. మరి తెలుగు నుంచి ఎవరు ఈ సినిమాలో చేయబోతున్నారు అంటే....సీన్ లోకి సునీల్ వచ్చారు. ఈ మేరకు అఫీషియల్ పోస్టర్ ని రిలీజ్ చేసారు. పోస్టర్‌ను బట్టి చూస్తే సునీల్ ఇందులో సీరియస్ పాత్రలో కనిపించనున్నాడని చెప్పవచ్చు.
సునీల్ లుక్ పుష్ప సినిమాలో మంగళం శీను పాత్రను గుర్తుకు తీసుకొస్తోంది. అయితే డ్రెస్సింగ్ మాత్రం జపాన్ వాడిలా కాస్త వింతగా అనిపిస్తోంది. నెగిటివ్ పాత్రలో సునీల్ కనిపించబోతున్నట్లు చెప్తున్నారు. ఈ సినిమాకి సునీల్ ఏకంగా రెండు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లుగా తమిళ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
జైలు బ్యాక్‌డ్రాప్‌లో జరగనున్న ఈ సినిమాలో రజినీకాంత్ ‘జైలర్’ పాత్రలో కనిపించనున్నారు. ఒక సెంట్రల్ జైలు నేపథ్యంలో 24 గంటల వ్యవధిలో జరిగే కథ ఇది అని రూమర్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సౌత్ ఇండియా టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. సన్ పిక్చర్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో రజినీకాంత్‌కి జోడీగా చాలా కాలం తర్వాత రమ్యకృష్ణ నటిస్తోంది. ఈ ఇద్దరూ కలిసి గతంలో నరసింహా సినిమాలో నటించిన విషయం తెలిసిందే.
బీస్ట్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'జైలర్' యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఈ సినిమాపై రజనీ ఫ్యాన్స్ భారీ అంచనాలే పెట్టుకున్నారు. యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌తో ఈ మూవీ రాబోతోందని.. అలానే రజినీ మార్క్ కామెడీ కూడా ఈ సినిమాలో చూస్తారని దర్శకుడు నెల్సన్ దిలీప్ ఇప్పటికే తెలిపారు. గతేడాది పెద్దగా హిట్ లేని సూపర్‌స్టార్ రజనీకాంత్‌కి ఈ సినిమా హిట్ తేవాలని ఎదురు చూస్తుపన్నారు. ఆర్ నిర్మల్ ఎడిటర్‌గా ఎంపికయ్యారు. 'జైలర్'లో శివ రాజ్‌కుమార్, రమ్యకృష్ణ, వసంత్ రవి, వినాయకన్, యోగిబాబు వంటి యాక్టర్లు ఉన్నారు. ఈ సినిమాను, ఏప్రిల్ 14వ తేదీన తమిళంతో పాటు ఇతర భాషల్లోను విడుదల చేయనున్నారు.