
ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షోకి కనీవినీ ఎరుగని రీతిలో రేటింగ్స్ వస్తున్నాయి. అందుకనే కమెడియన్ నుంచి హీరోగా ఎదిగిన సునీల్ కన్ను కూడా ఈ షోపై పడింది. మంచి సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న సునీల్.. తన కొత్త సినిమా ప్రమోషన్ కోసం ‘బిగ్ బాస్’ను నమ్ముకున్నాడు. గురువారం ఎపిసోడ్‌లో బిగ్ బాస్ హౌజ్‌లో సునీల్ హంగామా చేశాడు. తను హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఉంగరాల రాంబాబు’. ఈ సినిమా శుక్రవారం (సెప్టెంబర్ 15న) ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా విడుదలకు ఒకరోజు ముందు బిగ్ బాస్ ద్వారా ప్రచారం చేసుకున్నాడు సునిల్.
ఇక బిగ్ బాస్ హౌజ్ లో నవదీప్ కౌగిలితో ఘన స్వాగతం అందుకున్న సునీల్ అందరితో సరదాగా గడిపాడు. తన సినిమాకు సంబంధించిన స్టోరీ వివరించాడు. చిన్నప్పటి నుంచి తాత దగ్గర పెరుగుతున్న రిచ్ మనవడి పాత్రలో తాను నటించినట్లు సునిల్ తెలిపాడు. చిన్నప్పుడు స్కూల్లో ఎవడో కొడితే తాతతో స్కూల్ వద్దంటా. అప్పుడు తాత అదేంటి అని అడిగితే.. నన్నెవడో కొట్టాడు. అందుకే అని చెప్తా. దానికి తాత బోస్ ఫోటో చూపెట్టి.. బ్రిటిషర్స్ ను కొట్టాడు. అలా వుండాలి అని చెప్తాడు. ఇక ఆ రోజు నుంచి నాకు ప్రతిసారి పీలైనప్పుడల్లా ఏదైనా ఇన్ స్పిరేషన్ కావాలి. అది వుంటే కేక. లేకుంటే డల్. అలాంటి సమయంలో నా ఫ్రెండ్స్ అందర్నీ కింద పడేసి ఒకడు కొడతాడు. ఆ సమయంలో నాకు గ్యాంగ్ లీడర్ ఫైట్ ఇన్స్ పిరేషన్ గా నిలుస్తుంది.. అక్కడి నుంచి అంతా పోగొట్టుకుని... సెకండాఫ్ లో హరితేజ ఊరికి వెళ్తాం. అలా కథ సాగుతుంటుంది అంటూ ఉంగరాల రాంబాబు గురించి చెప్పుకొచ్చాడు. ఇక ఆతర్వాత సునిల్ బిగ్ బాస్ హౌజ్ తీరుతెన్నుల గురించి ఇంటిసభ్యుల వద్ద ఆరా తీశాడు.
ఇక సునీల్‌ని బిగ్ బాస్ హౌజ్‌లో చూసి హరితేజ చాలా థ్రిల్ ఫీలైంది. ‘ఉంగరాల రాంబాబు సినిమా రేపు విడుదలవుతుంది’ అని సునీల్ అనగానే.. రేపా అని ఆశ్చర్యం వ్యక్తం చేసింది హరితేజ. హౌజ్ లో వుండటంతో ఏమీ తెలియలేదని, సినిమా ఎప్పుడో రిలీజ్ అయిపోయి వుంటుందనుకున్నానని హరితేజ సునీల్ తో అంది. ఇంతకీ అలా ఎందుకందంటే హరితేజ కూడా ‘ఉంగరాల రాంబాబు’లో ఓ పాత్ర పోషించింది. సుమారు రెండు నెలలుగా బిగ్ బాస్ హౌజ్‌లోనే ఉండిపోయిన హరితేజ.. తన కొత్త సినిమా విడుదలవుతోందని తెలిసి చాలా ఆనందం వ్యక్తం చేసింది. షో ముగియడానికి ఇంకా ఎక్కువ రోజులు లేవు కాబట్టి ప్రేక్షకులను మరింత ఆకర్షించేలా ఎపిసోడ్‌లను ఎమోషనల్‌గా తీర్చిదిద్దుతున్నారు.