
బాలీవుడ్ లో చాలా ప్రశాంతంగా ఉండే హీరోలలో సునిల్ శెట్టి ఒకరు. ప్రశాంతత, వివేకం, వ్యక్తిత్వానికి పేరుగాంచిన వ్యక్తి సునిల్ శెట్టి. వయసుతో సబంధంలేకుండా మనసు ముఖ్యం అంటుంటాడు సునిల్ శెట్టి. ఏజ్ కేవలం ఒక నెంబర్ మాత్రమే, నిజమైన శక్తి ముఖ్యం అని తన అభిమానులకు గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో ఆలోచింపజేసే పోస్ట్‌ను షేర్ చేశాడు సునిల్ శెట్టి.
సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ ను షేర్ చేశారు సునిల్ శెట్టి. వ్యక్తులు , వ్యాపారాలు కూడా వారి వయస్సుతో కాదు, వారిలోని ఉత్సాహంతో నిర్వచించబడాలని శెట్టి అన్నారు.. “మీకు 30 ఏళ్లు ఉండి అలసిపోవచ్చు. లేదా 65 ఏళ్లు ఉండి చురుగ్గా ఉండొచ్చు” అది వయస్సుని బట్టి కాదు, మనసుని బట్ట ఉంటుందని ఆయన అన్నారు. కాలం గడిచేకొద్దీ కాదు, లోపలి ప్రేరణే జీవశక్తిని నిర్ణయిస్తుందని వివరించారు.
కొత్తగా ప్రారంభించిన కంపెనీలు కొన్ని సంవత్సరాలలోనే తమ ఉత్సాహాన్ని కోల్పోవడాన్ని, కుటుంబ వ్యాపారాలు దశాబ్దాలుగా ఎలా వృద్ధి చెందుతున్నాయో తాను చూశానని సునీల్ శెట్టి వివరించారు. వయసు కాదు, క్రమశిక్షణ, ఉత్సుకత, ఆకలి, ధైర్యం నిర్ణయాత్మక అంశాలు ముఖ్యం అని ఆయన అన్నారు.
ఈ ఆలోచనను జీవితానికి అన్వయిస్తూ సునీల్ శెట్టి చేసిన కామెంట్స్ వైరల్ అవుతునర్నాయి. పట్టుదల కోల్పోతే యువకుడు కూడా వృద్ధుడిగా భావిస్తాడని, తమను తాము పునరుద్ధరించుకునే అనుభవజ్ఞులు ఎప్పటికీ యవ్వనంగా ఉంటారని శెట్టి నొక్కిచెప్పారు. “అందుకే నేను వ్యాపారం ఎంత పాతదో అడగను. అది ఎంత చురుగ్గా ఉందో చూస్తాను” అని ఆయన తన పోస్ట్ లో రాశారు.
తన కుటుంబం - భార్య , పిల్లలు అతియా, అహాన్ - తనను నెమ్మదిగా ఉండమని, ముఖ్యంగా ఇప్పుడు అతియా బిడ్డ పుట్టిన తర్వాత తనను నెమ్మదిగా ఉండమని కోరుతున్నారని శెట్టి వెల్లడించారు. కుటుంబ సమయం ఇప్పుడు తనకు చాలా ముఖ్యమైనదని అంగీకరిస్తూనే, తనను నడిపించే శక్తిని తాను తిరస్కరించలేనని సునీల్ ఒప్పుకున్నారు.
రాబోయే రోజు కోసం ఉత్సాహంతో నిద్ర లేవడం వరకు, వెనక్కి తగ్గడం న్యాయం కాదని ఆయన వివరించారు. జీవితం అందించే అవకాశాలను వదులుకోవడమే తనకు విశ్రాంతి అని ఆయన అన్నారు. కృతజ్ఞతతో ముగిస్తూ, శెట్టి ఇలా రాశారు, “ఆ రోజు వచ్చేవరకు, నేను కృతజ్ఞతతో ఉంటాను. నేను ప్రయత్నిస్తూనే ఉంటాను.”
63 ఏళ్ల వయసులో, సునీల్ శెట్టి ఆలోచనలు అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. నిజమైైన యవ్వనం వయసును బట్టి కాదు , స్ఫూర్తిలో ఉందని సునిల్ శెట్టి అందించిన పవర్ పుల్ రిమైండర్ - అభిమానులలో స్ఫూర్తిని నింపింది.