రవితేజ `మాస్‌ జాతర` మూవీ వాయిదా, కారణం ఏంటంటే? కొత్త డేట్‌ ఇదేనా?

Published : Aug 26, 2025, 12:36 PM IST
mass jathara movie, raviteja

సారాంశం

రవితేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ `మాస్‌ జాతర`. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీ రిలీజ్‌ వాయిదా పడింది. కొత్త రిలీజ్‌ డేట్‌ అప్‌ డేట్‌ ఏంటంటే? 

మాస్‌ మహారాజా రవితేజ హీరోగా నటించిన `మాస్‌ జాతర` మూవీ మరో రెండు రోజుల్లోనే విడుదల కావాల్సింది. కానీ తాజాగా ఇది వాయిదా పడింది. చిత్ర బృందం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. `మాస్‌ జాతర`ని వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. రవితేజ హీరోగా, శ్రీలీల హీరోయిన్‌గా ఈ మూవీ రూపొందుతుంది. `ధమాఖా తర్వాత రవితేజ, శ్రీలీల జోడీ కట్టిన చిత్రమిది. కొత్త దర్శకుడు భాను భోగవరపు దర్శకత్వం వహించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ మూవీని నిర్మిస్తున్నారు.

`మాస్‌ జాతర` సినిమాని ఆగస్ట్ 27న విడుదల చేయబోతున్నట్టు గతంలో టీమ్‌ ప్రకటించింది. ఈ మేరకు టీజర్‌ని కూడా విడుదల చేశారు. టీజర్‌ బాగా ఆకట్టుకుంది. సినిమాపై బజ్‌ క్రియేట్‌ చేసింది. రవితేజ మార్క్ మాస్‌ కమర్షియల్‌ సినిమా వస్తుందనే చర్చ స్టార్ట్ అయ్యింది. కానీ విడుదల వాయిదా వేస్తున్నట్టు మంగళవారం చిత్ర బృందం ప్రకటించడం గమనార్హం. 

దీనికి కారణాలు చెబుతూ, ఇటీవల తెలుగు పరిశ్రమ వ్యాప్తంగా జరిగిన సమ్మెలు, కీలకమైన కంటెంట్ పూర్తి చేయడంలో ఊహించని జాప్యం కారణంగా.. సినిమాను అనుకున్న తేదీకి సకాలంలో సిద్ధం చేయలేకపోయామని నిర్మాతలు అధికారికంగా తెలిపారు. కంగారుగా సినిమాని విడుదల చేయడం కంటే కాస్త సమయం తీసుకొని అత్యుత్తమ చిత్రంగా మలిచి, ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని అందించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్మాతలు స్పష్టం చేశారు.

`మాస్ జాతర` చిత్రాన్ని అసలైన పండుగ సినిమాగా తీర్చిదిద్దడానికి ప్రతి విభాగం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని, ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయని నిర్మాతలు తెలిపారు. కొత్త విడుదల తేదీ ఇంకా ఖరారు కానప్పటికీ, త్వరలోనే ప్రకటన వస్తుందని పేర్కొన్నారు. అభిమానులు నిరీక్షణకు బహుమానంగా త్వరలో సర్‌ప్రైజింగ్‌ కంటెంట్ రాబోతుందని నిర్మాతలు హామీ ఇచ్చారు. కాస్త ఆలస్యమైనా అసలు సిసలైన మాస్ పండుగను థియేటర్లలో తీసుకొస్తామని నిర్మాతలు తెలిపారు. అయితే తెలుస్తోన్న సమాచారం మేరకు  అక్టోబర్‌ మూడో వారంలో సినిమాని విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం.

 

 

 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Sara Arjun: ధురంధర్ స్టార్ సారా అర్జున్ రూ.12 కోట్ల లగ్జరీ ఫ్లాట్.. వైరల్ ఫోటోలు
Top 10 Movies 2025: పవన్, వెంకటేష్, రాంచరణ్ లలో బాక్సాఫీస్ వద్ద ఎవరి సత్తా ఎంత ? 2025లో టాప్ 10 మూవీస్ ఇవే